Srikanth: శ్రీకాంత్‌ను తీసుకోకపోతే రూ.2కోట్లు ఇస్తామన్నారు!

Srikanthటాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలు అందించిన వారిలో డైరెక్టర్ కృష్ణవంశీ. 2002లో ‘మురారి’ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత హిందీలో ఓ సినిమా తీశాడు. కాలేజ్ డేస్ నుంచే కృష్ణవంశీకి విప్లవభావాలు ఎక్కువ. అందుకే తన మూడో చిత్రం ‘సింధూరం’ తీశాడు. అయితే సినిమాకు మంచి పేరు వచ్చినా.. డబ్బులు రాలేదు. దాంతో తన తర్వాతి దేశభక్తి సినిమాతో మంచి పేరుతోపాటు డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్నాడు. 1990లో ముంబై ఉగ్రదాడులు అప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. కమర్షియాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో జోడించి.. కథను సిద్ధం చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఉగ్రవాదుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కృష్ణవంశీ జైలుకు వెళ్లి అధ్యాయనం చేశాడు.

 

 

అగ్రకథానాయకుల కంటే యువ నటులతో సినిమా తీయడానికి కృష్ణవంశీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడే ఇండస్ట్రీలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఫామ్‌లో ఉన్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. అంజాద్ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ సెట్ అవుతాడని భావించాడు. అలాగే అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. ఇండస్ట్రీలో ‘ఒక్క ఛాన్స్’ కోసం వేచి చూసే యువకుడి పాత్రలో రవితేజను సెలెక్ట్ చేశాడు. మరీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎవరు చేస్తారనే ప్రశ్న కృష్ణవంశీ మదిలో మెదిలింది. అప్పుడు నిర్మాత వేరొకరి పేరు సూచించాడు. కానీ కృష్ణవంశీ మదిలో శ్రీకాంత్ పేరుంది. నిర్మాత మాత్రం శ్రీకాంత్‌ని తీసుకోద్దని చెబుతున్నాడు. ఎందుకంటే అప్పటికీ శ్రీకాంత్ లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో నటిస్తున్నాడు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ చేయలేడని చెప్పాడు.

 

 

దాంతో కృష్ణవంశీ.. శ్రీకాంత్‌ను తన ఆఫీస్‌కు పిలిపించుకున్నాడు. నిర్మాత సుంకర మధు మురళి ముందే.. ‘పోలీస్ ఆఫీసర్ పాత్రలో నిన్ను తీసుకోవద్దని మురళి అంటున్నాడు.. ఏం చేయమంటావు’ అని కృష్ణవంశీ చెప్పాడు. దాంతో మధు మురళి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకుని ‘శ్రీకాంత్ మీరు ఫ్యామిలీ హీరో.. ఇలాంటి క్యారెక్టర్ చేయలేరు. అందుకే వద్దన్నాను.’ అని తెలిపాడు. కృష్ణవంశీ మాత్రం శ్రీకాంత్‌నే పోలీస్ ఆఫీసర్‌గా తీసుకోవాలని పట్టుబట్టాడు. కానీ నిర్మాత మురళి మాత్రం.. శ్రీకాంత్‌ను తీసుకోకపోతే.. రూ.2కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. చివరకు శ్రీకాంత్‌కే ఆ పాత్ర దక్కింది. రాధాకృష్ణగా శ్రీకాంత్, అంజాద్ ఖాన్‌గా ప్రకాశ్ రాజ్, కోటిగా రవితేజను ఎంపిక చేశారు. ఈ ముగ్గురు హీరోలతో తీసిన సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. రికార్డులు తిరగరాసింది. కాగా, ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -