Srinu Vaitla-VV Vinayak: అప్ డేట్ కాకపోతే గుడ్ బై చెప్పాల్సిందే.. వినాయక్, శ్రీనువైట్లకు ముగింపు సమయం వచ్చిందా!

Srinu Vaitla-VV Vinayak:  తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు వి.వి వినాయక్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2002లో వచ్చిన ఆది సినిమాతో వినాయక్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక కామెడీ సినిమాలను నిర్మించడంలో కూడా వినాయక్ ముందంజలో ఉంటాడు. ఇక ఖైదీ నెంబర్ 150 తో వినాయకు ఒక రేంజ్ లో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ అంతకుముందు చేసిన సినిమాలు వినాయక్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అంతేకాకుండా ప్రస్తుతం వినాయక్ కు సంబంధించిన ఏ సినిమాలో కూడా తెరపైకి రావడం లేదు. అదేవిధంగా దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు నీకోసం సినిమా ద్వారా టాలీవుడ్ లో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆనందం సినిమాతో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

మరి ఇటువంటి శ్రీను వైట్ల కూడా దాదాపు పదికి పైగా సినిమాలు దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమాలేమీ అతనికి అంతగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. స్టోరీ విషయంలో మాత్రం శ్రీను వైట్ల పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాడు అని కొందరు అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల, వినాయక్ లకు టైమ్ అసలు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఫ్లాప్ లను చవి చూస్తున్నాయి. అంతేకాకుండా నిర్మాతలకు కూడా భారీ స్థాయిలో నష్టం వచ్చి పడుతుంది.

ఇక వినాయక్ కి ఖైదీ నెంబర్ 150 సినిమా తప్ప మరి ఏ సినిమా తనకి సక్సెస్ ఇవ్వలేదు. అయితే కాలానికి తగ్గట్టుగా వీరిద్దరి కథలు ఉండడం లేదు. అందుకే వీరిద్దరి దర్శకలు సినిమాలు పూర్తిగా ప్లాప్ అవుతున్నాయి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అప్ డేట్ కాకపోతే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిందే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పుకార్ల గురించి ఆ డైరెక్టర్లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -