SrNTR: సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఈ వీక్ నెస్ గురించి తెలుసా?

SrNTR: తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచేపోయే పేరు నందమూరి తారకరామారావు. తెలుగు సినిమా కీర్తి చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన హీరోగా నందమూరి తారకరామారావుకు తిరుగులోని గుర్తింపు ఉంది. తెలుగు ప్రేక్షకులు నందమూరి తారకరామారావును ఓ నటుడిగా కాకుండా యుగ పురుషుడిగా కొలిచే వారు. తెలుగు సినిమాకే వన్నె తెచ్చిన ఎన్టీఆర్ గురించి చాలా కొద్దిమందికి ఆయన వీక్ నెస్ గురించి తెలుసు.

 

సినిమాలు ఒప్పుకున్నాడంటే ఎన్టీఆర్.. ఆ సినిమా కోసం ప్రాణం పెట్టే వాడని తెలుగు ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న ఎన్టీఆర్.. ఆ కష్టం, పట్టుదల కారణంగానే తిరుగులేని విజయాలను పొందగలిగాడు. నందమూరి తారకరామారావు సినిమా వచ్చిందంటే అది వంద రోజుల సినిమాగా నిలిచేది. అయితే నిర్మాతల విషయంలో, డబ్బుల విషయంలో ఎన్టీఆర్ నిక్కచ్చిగా ఉండేవారట.

 

నిర్మాత చెప్పిన మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని, సినిమా ప్లాఫ్ అయినా, హిట్ అయినా దానికి ఎన్టీఆర్ తో సంబంధం ఉండేది కాదట. అప్పట్లో చాలామంది సినిమా ప్లాఫ్ అయితే తాము తీసుకున్న రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చే వాళ్లట. ఎన్టీఆర్ ని కూడా నిర్మాతలు రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి ఇవ్వాలని కోరితే.. ఖచ్చితంగా కుదరదని తేల్చి చెప్పేవారట. ఇది చాలామందికి నచ్చకపోయేదట. ఎన్టీఆర్ కు డబ్బు పిచ్చి ఉండేదని, ఆ వీక్ నెస్ వల్ల ఆయనంటే కొందరు నిర్మాతలు భయపడేవారట.

 

నిర్మాతలు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందనే ఉద్దేశంతో నాటి నటులు నాగయ్య, ఎస్వీ రంగారావు లాంటి వాళ్లు నిర్మాతలను ఆదుకునే వారట. వారు తీసుకున్న రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి తిరిగిచ్చే వారట. కానీ ఎన్టీఆర్ మాత్రం నిర్మాతలకు మొహమాటం లేకుండా కుదరని చెప్పే వారట. ముందుగా నిర్మాతలకు కథ నచ్చిన తర్వాతే తన వరకు తీసుకురావాలని, సినిమా కోసం ప్రాణం పెట్టడం తన పని అని చెప్పే వారట.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -