Star Comedians: వామ్మో.. కమెడియన్స్ కు ఒక్క రోజుకే ఇంత పారితోషకమా!

Star Comedians: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో పారితోషకం విషయంలో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ భారీ స్థాయిలోనే పుచ్చుకుంటారు. ఇక హీరోలు హీరోయిన్ల పారితోషకం విలువ టెలివిజన్ రూపంలో మనకు అప్ డేట్ ఇస్తూనే ఉంటారు. ఇక హీరో హీరోయిన్ల పారితోషకం మాత్రం పెద్ద మొత్తంలోనే ఉంటుంది.

ఇక కమెడియన్ల విషయానికొస్తే.. వీరు రోజుకి ఎంత పరితోషికం తీసుకుంటారు అన్న దానిపై ఎవరికి అంత అవగాహన లేదు. కమెడియన్స్ పారితోషికం విలువ ఎంత ఉంటుందో కూడా కమెడియన్సు ఎప్పుడు నోరు విప్పలేదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ల పారితోషకం వివరాలు బయటపడ్డాయి. ఇప్పుడు మనం వాటి వైపు ఒక లుక్కు వేద్దాం.

ప్రేక్షకులను ఒక రేంజ్ లో నవ్వించే వెన్నెల కిషోర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ కమెడియన్ నటించడానికి రోజుకు మూడు లక్షల రూపాయల వరకు తీసుకుంటాడు అన్నట్లు తెలుస్తుంది. ఇక కమీడియన్ కి మరో రూపం అయినటువంటి.. బ్రహ్మానందం గారి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఈయన ఒక రోజు నటించడానికి 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక నవ్వులకు చిరునామాగా నిలిచిన సునీల్ గురించి మనందరికీ తెలిసిందే.

సునీల్ ఒక రోజుకు నాలుగు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక నవ్వులు పండించే రారాజు ఆలీ 3.5 పారితోషికం ఒక రోజుకు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి కమెడియన్ సప్తగిరి రెండు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ద మోస్ట్ వాంటెడ్ కమెడియన్.. పోసాని మురళీకృష్ణ ఒక రోజుకు రెండు పాయింట్ ఐదు లక్షలు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక రాహుల్ రామకృష్ణ సుమారు రెండు లక్షల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కమెడియన్ పృథ్వీరాజు కూడా రెండు లక్షల ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రియదర్శి కూడా అదే మొత్తంలో పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి శ్రీనివాసరెడ్డి కూడా రోజుకు రెండు లక్షల తీసుకుంటున్నాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -