Anushka: స్టార్ హీరోయిన్ అనుష్క రేటు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Anushka: యోగ టీచర్ గా కెరియర్ ప్రారంభించి సూపర్ సినిమా ద్వారా సినిమాల్లో అడుగుపెట్టిన అనుష్క అరుంధతి సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోకుండా తిరుగులేని తారగా టాలీవుడ్ ని ఒక దున్ను దున్నేసింది. ఒకప్పుడు హీరోయిన్ అంటే అనుష్కనే కావాలి అని పట్టుబట్టిన హీరోలు అటుతమిళంలోనూ ఉన్నారు ఇటు తెలుగులోనూ ఉన్నారు.

 

నయనతార ని అందరూ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు కానీ అనుష్కని తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నంతగా నయనతారని ఓన్ చేసుకోలేదని చెప్పాలి. టాలీవుడ్ లోనే కాదు దక్షిణాది భాషలు అన్నిట్లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ 40 ఏళ్ళు దాటిన ఇప్పటికీ ఆమె చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

తెలుగులో ప్రభాస్ తో ఎక్కువ సినిమాల్లో కనిపించిన అనుష్క చాలా రోజులు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్లు వచ్చాయి. వాటన్నింటిని కొట్టిపారేశారు ప్రభాస్, అనుష్క. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు. కరోనాలో వచ్చిన భాగమతి తర్వాత ఆమె నుంచి మరే సినిమా రాలేదు.

 

చాలా రోజుల తర్వాత ఆమె కన్నా చాలా చిన్నవాడైన నవీన్ పోలిశెట్టి కి జోడిగా వస్తున్న సినిమా మిస్ శెట్టి వెర్సెస్ మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది ఇందుకు కారణం హీరో కన్నా హీరోయిన్ పెద్దది అవటంవల్ల కథ ఎలా ఉంటుందో అన్నా ఆసక్తి.

 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన స్టిల్స్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పట్ల ఒక క్లారిటీ వచ్చింది. గట్టి పోటీ మధ్య ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ హక్కులని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఎవరు చూడకపోయినా అనుష్కకి ఇంత రేటా బానే ఇస్తున్నారు గా అంటూ షాక్ అవుతున్నారు సదరు ప్రేక్షకులు.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -