Star Directors: విలన్ రోల్స్ లో నటించి మెప్పించిన ప్రముఖ డైరెక్టర్లు వీళ్లే.. ఈ దర్శకుల నటనకు ఫిదా అవ్వాల్సిందే!

Star Directors: మామూలుగా దర్శకులు తెరపై కనిపించడం అన్నది కొత్త ఏమీ కాదు. గతంలో చాలా సినిమాలలో డైరెక్టర్లు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. మరి విలన్ రోల్స్ లో నటించి మెప్పించిన దర్శకులు ఎవరు? వాళ్ళు ఏ సినిమాలలో నటించారు అన్న వివరాల్లోకి వెళితే.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెదకాపు 1 సినిమాలో విలన్ పాత్రలో నటించారు. అయితే ముందుగా ఆ క్యారెక్టర్‌ కోసం మలయాళ సినిమా కుంబలంగీ నైట్స్ లో నటించిన ఒకరిని ఎంపిక చేశారట. అయితే, అతడు షూటింగ్‌కు వస్తానని చెప్పి రెండు సార్లు మాట తప్పడంతో ఓ సన్నిహితుడు సలహా మేరకు శ్రీకాంతే నటించాల్సి వచ్చింది.

కాగా ఈ పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఈ నెల 29న విడుదల కానుంది. మరో డైరెక్టర్ కరుణకుమార్.. ఈయన నా సామి రంగ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఎస్‌.జె. సూర్య.. మొదట నటుడు అవ్వాలి అని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనుకోకుండా దర్శకుడిగా మారారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్క్‌ ఆంటోని.. విశాల్‌ హీరోగా నటించినా ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శితం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌, రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ తదితర సినిమాల్లో సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సముద్ర కానీ మొదట యాక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే.

అయినా కూడా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడంతోపాటు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఇటీవలె బ్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌.. ఈయన నాగ చైతన్య ఏమాయ చేసావె, వెంకటేశ్‌ ఘర్షణ సూర్య నటించిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్ తదితర చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌. అలాగే హిట్‌లిస్ట్‌ అనే తమిళ సినిమాలోనూ నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో నటించారు పోషించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -