Director Harish Shankar: నువ్వేంటి.. నీ రేంజేంటీ.. డైరెక్టర్ పై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్?

Director Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన రవితేజ జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించిన షాక్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా ఘోర పరాజయం కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ కి గట్టి షాక్ తగిలింది. అనంతరం ఈయన రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన పెద్దగా హిట్ కాలేదు.

ఇలా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఈయన స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత హరిశంకర్ చేసిన తదుపరి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈయన మరోసారి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హరీష్ శంకర్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ హీరో దారుణంగా శంకర్ ను అవమానించారనే వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు.ఇదే విషయాన్ని డైరెక్టర్ దగ్గర ప్రస్తావించగా ఆ హీరో ఇప్పుడు మనిద్దరి కాంబోలో వచ్చే సినిమా ఎలాగో హిట్ అవుతుందని చెప్పారట.

ఈ సినిమా హిట్ అయిన తర్వాత మీకు మరొక హిట్ ఇస్తానని హరీష్ శంకర్ చెప్పగా ఆ హీరో ఇగో హర్ట్ అవడంతో ఇండస్ట్రీలో నువ్వేంటి….నీ రేంజ్ ఏంటి నువ్వు నాకు హిట్ ఇవ్వడం ఏంటి అంటూ దారుణంగా అవమానించారని తెలుస్తోంది. అయితే ఆ హీరో బడా ఫ్యామిలీకి చెందిన హీరో కావడంతో హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్ని బయట ఎక్కడ చెప్పకుండా మనసులో దాచుకున్నారట.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -