Rashmika: రష్మికవి చాలా పెద్దవి.. ఆ ప్రముఖ నటుడి కామెంట్స్ వింటే మాత్రం షాకవ్వాల్సిందే!

Rashmika: కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడలో ఓవర్ నైట్ స్టార్ అయింది రష్మిక. అయితే మొదటి సినిమాలోని తనతో నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఆ ప్రేమని ఎంగేజ్మెంట్ వరకు తీసుకు వెళ్లింది ఈ భామ. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ వారిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ఆగిపోయిన తరువాత కన్నడ ఇండస్ట్రీకి చాలా కాలం వరకు దూరంగా ఉంది రష్మిక. అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షిత్ కు రష్మిక తో ఇంకా టచ్ లో ఉన్నారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి సమాధానంగా అవును రష్మిక నేను టచ్ లో ఉన్నాం. తనకు సినిమా ప్రపంచంలో చాలా పెద్ద కలలు ఉన్నాయి. అందుకే ఆమె ఇప్పుడు ఆ కలవైపు అడుగులేస్తుంది. అనుకున్న టార్గెట్ ని అందుకునే సామర్థ్యం తనకి ఉంది. తను గెలుపుకి మనం ఆమె భుజం తట్టాలి అని మరోసారి రష్మిక కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు రక్షిత్.

వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిన తర్వాత రష్మిక ఎప్పుడు రక్షిత్ గురించి మాట్లాడలేదు. కానీ రక్షిత్ మాత్రం తన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఓపెన్గానే ఆల్ ద బెస్ట్ చెప్తూ వచ్చాడు. అలాగే తన నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతాడు. ఏది ఏమైనప్పటికి ఇద్దరు ప్రశాంతంగా ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.

రష్మిక పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకుంటే రక్షిత్ మాత్రం కన్నడ లో మంచి పేరు సంపాదించుకోవటంతో పాటు పాటు ఇటు తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిన సప్తసాగర్దాచే ఎల్లో సైడ్ ఎ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దానిని సప్తసాగరాలు దాటి అనే టైటిల్ తో తెలుగులో తీశారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది అలాగే ఇప్పటికే చార్లీ చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయ్యాడు రక్షిత్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -