Rajamouli: రాజమౌళి ఇంటికి వెళ్లి ఆఫర్ ఇచ్చినా రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఆమేనా.. ఇంతలా అవమానించాలా?

Rajamouli: టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ దర్శకుడిగా రాణించడంతో పాటు అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తన క్రేజ్ ని మరింత పెంచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు జక్కన్న. ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా విషయానికి వస్తే.. ఇందులో రానా, తమన్నా, అనుష్క, ప్రభాస్ లు నటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదల తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఆ సినిమాలో పాత్రల పేర్లు మార్మోగిపోయాయి.

కానీ సినిమాలో అవంతిక పాత్రలో నటించిన తమన్నాకు మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదని చెప్పవచ్చు.కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె బాగా పబ్లిసిటీ దక్కించుకుంది. అంతేకానీ బాహుబలి సినిమా అంటే మాత్రం ముందుగా అందరికీ గుర్తొచ్చేది రాజమౌళి,ఆ తర్వాత ప్రభాస్, రానా, అనుష్క అంతే.

అయితే రాజమౌళి తమన్నా కోసం రాసుకున్న పాత్రలో ముందుగా హీరోయిన్ రాశి ఖన్నాను అనుకున్నారట. పాత్ర నచ్చిన అంత పెద్ద ఆఫర్ వచ్చినా రాశి ఖన్నా ఇందులో వేరే స్టార్ హీరోలు హీరోయిన్లు నటిస్తున్నప్పుడు నన్ను జనాలు పట్టించుకోరు అన్న భయంతో రిజెక్ట్ చేసిందట. రాశిఖన్నా కూడా ఈ సినిమాలో నటించి ఉంటే ఇంకా దారుణంగా ఉండేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

తమన్నా నైనా ఇద్దరు ముగ్గురు పట్టించుకుంటున్నారు. అదే రాశిఖన్నా నటించి ఉంటే ఒక్కరు కూడా పట్టించుకునేవారు కాదు అంటున్నారు జనాలు.మొత్తానికి కరెక్ట్ నిర్ణయం తీసుకుంది రాశిఖన్నా అంటూ పొగిడేస్తున్నారు. రాశిఖన్నాను ఈ సినిమాలో తీసుకోవాలి అనుకున్న రాజమౌళి ఆమె ఇంటికి వెళ్లి ఈ పాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -