Heroine-Producer: పాపం ఆ హీరోయిన్.. ఆ నిర్మాత చేతిలో నలిగిపోతోంది?

Heroine-Producer: సాధారణంగా సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల జీవితాలలో ఏ చిన్న విషయం జరిగిన అది వార్త కావాల్సిందే.ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ప్రేమలు, డేటింగ్‌లు, పెళ్లి వార్తల గురించి మరింత చర్చలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా దక్షిణాదికి చెందిన ఓ స్టార్ హీరోయిన్ వివాహం గురించి చాలా రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లి ఆలస్యం అవడానికి ఓ బడా నిర్మాతే కారణం అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో కొంతమంది సినీ రంగానికి చెందిన హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులపై కూడా లైంగిక వేధింపులు, లైంగిక బెదిరింపులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సామాన్య ప్రజల కంటే సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా జరుగుతున్నాయని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెబుతున్నారు.కొంతమంది వీటి గురించి మీడియాకు బయట వాళ్లకు తెలియజేస్తే మరి కొంత మంది సైలెంట్ గా ఉంటారు.

కానీ ఇలాంటివి ఎంతమంది దాచిన ఇప్పటికీ తాగవు. ఇలాంటి వార్తలు మరీ ఎక్కువగా హీరోయిన్లను నిర్మాతలు,డైరెక్టర్లు లైంగికంగా వేధిస్తున్నారని,లైంగిక బెదిరింపులు చేస్తున్నారని చాలామంది హీరోయిన్ల ఏదో ఒక సందర్భంగా చెబుతూనే ఉంటారు.అయితే ఈ విధంగానే ఓ స్టార్ హీరోయిన్ ను ఓ నిర్మాత గత కొంతకాలంగా వేధిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఆ హీరోయిన్ పెళ్లి రద్దు చేసుకుంటే మంచిది లేదంటే నీ జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ స్టార్ హీరోయిన్ ఎవరో,ఈ స్టార్ నిర్మాత ఎవరో పూర్తి స్పష్టత లేనప్పటికీ ఈ వార్త మాత్రం సినీ ఇండస్ట్రీలో చర్చగా మారింది.అయితే ఈ స్టార్ హీరోయిన్ ఒక మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి, ఆమె హీరోయిన్ గా తమిళ పరిశ్రమకు పరిచయమైంది. ఆ సమయంలో ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. అప్పుడు ఆమెకు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అనే అవార్డు వచ్చింది.

ఇక ఆమెకు ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఎంత వయసు వచ్చినా కొంత మంది హీరోయిన్లకు సినిమా అవకాశాలు మాత్రం తగ్గకుండా ఉంటాయి. కానీ ఈ హీరోయిన్ కు మాత్రం వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈమె కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం సరిగ్గా లేదు. అయితే ఈమె తమిళ నిర్మాత యువ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఈమె ఎంగేజ్మెంట్ రద్దు అయ్యింది.

అయితే ఇంతకుముందు ఆమె ఎంతోమంది స్టార్ హీరోలతో డేటింగ్ చేసిందన్న రూమర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరోతో ఆమె పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం జరిగింది. కానీ హీరో తరఫునుంచి కానీ హీరోయిన్ తరఫునుంచి కానీ ఇలాంటి క్లారిటీ రాలేదు.. అయితే ఈ పెళ్లికి లేట్ అవుతుందని దీనికి కారణం ఓ స్టార్ నిర్మాత అని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.

ఈ స్టార్ హీరోయిన్ ను ఆ స్టార్ నిర్మాత ఇబ్బంది పెడుతున్నాడని తెలిసింది. ఈ స్టార్ హీరోయిన్ ఒక బ్యానర్‌లో కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకుందనీ అయితే, ఆమె పెళ్లి చేసుకుంటే ఆ డీల్ క్యాన్సిల్ చేస్తానని సదరు ప్రొడ్యూసర్ బెదిరిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అలా అటు ఆమెను పెళ్లి చేసుకోనీయకుండా, సినిమాలలో నటించనీయకుండా అడ్డుపడుతున్నాడని ఫిలిం నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -