Gudivada: ఆ గుడ్లు పొదగడం ఆపి పరిశ్రమల సంగతి చూడు.. గుడివాడపై నెటిజన్ల సెటైర్లు వైరల్!

Gudivada: మాములుగా రాజకీయాలలో ప్రతిపక్ష నేతలు ఏ జిల్లాకైనా పర్యటనకు వెళ్తున్నారు అంటే ఆ జిల్లాలోని మంత్రులు యాక్టివ్‌ అవుతుంటారు. అలా తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు విశాఖలో పర్యటిస్తుండటంతో ముందుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ యాక్టివ్‌ అయ్యి ఆయనకు పది ప్రశ్నలు సంధించారు. ఎప్పటిలాగే 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందా లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖ రాజధానికి అనుకూలమా వ్యతిరేకిస్తున్నావా? చెప్పమని అడిగారు. ప్రధాని నరేంద్రమోడీతో బలమైన అనుబంధం ఉందని చెప్పుకొంటున్నప్పుడు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణని నిలిపివేయాలని ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు.

అయితే మంత్రి ప్రశ్నలకు జనసేన శతఘ్ని టీమ్‌ కూడా 10 ప్రశ్నలతో అదిరిపోయే జవాబు ఇచ్చింది. ఐటెమ్ రాజా గుడివాడ అమర్నాథ్! కాసేపు కోడిగుడ్లు పొదగటం ఆపేసి ఈ 10 ప్రశ్నలకు జవాబు చెప్పు అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ నాలుగేళ్ళలో నువ్వు నీ అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తగా ఒక్క రోడ్డు వేయించగలిగావా? పరిశ్రమల మంత్రినని చెప్పుకొనే నువ్వు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను రప్పించగలిగావా? పెట్టుబడులు, పరిశ్రమలు తేలేనప్పుడు నీకు మంత్రి పదవి ఎందుకు? దండగ. లులూ, జాకీ, అమర్ రాజా తదితర కంపెనీలన్నీ నీ వేధింపులు భరించలేకనే రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి కదా? నువ్వే రాష్ట్రానికి పరిశ్రమల మంత్రివి.

 

కనుక విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిల్సింది నువ్వే కదా? ఏం మాట్లాడావో చెప్పు? ఏటా రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీలు తీసుకొని వస్తుంటే వారిలో కనీసం 10 శాతానికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించలేకపోవడం వలన అందరూ పొట్టచేత్తో పట్టుక్ని పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళిపోతుంటే నీకు సిగ్గనిపించడం లేదా? ఉద్ధానం ప్రజల కిడ్నీ సమస్యల గురించి పవన్‌ కళ్యాణ్‌ చెప్పేవరకు కూడా మీకెవరికీ తెలీదు. అధికారంలో లేని పవన్‌ కళ్యాణ్‌ ఉద్ధానంలో కిడ్నీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే నువ్వు, మీ ప్రభుత్వం ఏం పీకుతున్నారు? అంటూ జనసేన 10 ప్రశ్నలు సంధించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -