Prashanth: సోషల్ స్టార్ ప్రశాంత్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా.. ఈ ఎంటెక్ యువకుడి సక్సెస్ స్టోరీ ఇదే!

Prashanth: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు అలాంటి వారిలో ఒకరు ప్రశాంత్. ప్రశాంత్ అంటే ఎవరో గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రషు బేబీ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ప్రషు బేబీ పేరిట ప్రశాంత్ ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

వ్యక్తిగత విభాగానికి సంబంధించి రాష్ట్రంలో హర్ష సాయి తర్వాత అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్నది ఈ ఛానల్ కే. ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు కూడా 1.4 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రశాంత్ వీడియోలను వీక్షిస్తున్నారు. టిక్ టాక్ తో తన సోషల్ మీడియా ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రశాంత్ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లికు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వారిది వ్యవసాయ కుటుంబం

వారికి ఇద్దరు కుమారులు కాగా ప్రశాంత్ చిన్నవాడు. మదనపల్లిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ చేశాడు. ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే నటనపై ఉన్న ఆసక్తితో సొంతంగా వీడియోలు రూపొందించి టిక్ టాక్ లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం ఇతివృతంగా వీడియోలు రూపొందించాడు అవి బాగా ట్రెండింగ్ కావడంతో లక్షల్లో సబ్స్క్రైబర్లు వచ్చారు. గవర్నమెంట్ టిక్ టాక్ నిషేధించడంతో తన దృష్టిని యూట్యూబ్ కి మళ్ళించాడు.

ప్రశాంత్ పాపులారిటీని గుర్తించిన పెద్దపెద్ద సంస్థలు అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఓటిటి సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. ఇంతటి ఘన విజయానికి కారణం ఇష్టపడి పనిచేయడం అంటాడు ప్రశాంత్. నేను మొదట్లో వీడియోలు చేస్తుంటే కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు కూడా తప్పుపట్టారు. కానీ సక్సెస్ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నాను అంటూ ఎంతో ఆనందంగా తన సక్సెస్ స్టోరీ చెప్పాడు ప్రశాంత్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -