Sivaji: అసలు నిజం బయటపెట్టిన శివాజీ.. ఆ ఇద్దరి కోసమే హౌస్ లో ఉన్నానంటూ?

Sivaji: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ కింద గాని ఆరువారాలలో విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటుగా ఏడవ వారం ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఏడవ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే తాజాగా హౌస్ లో ఏం జరిగింది అన్న విషయానికొస్తే.. నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇకపోతే బిగ్‌బాస్‌లోకి ఎవరొచ్చినా సరే గేమ్స్ ఆడాలి, మాటలతో మెప్పించాలి.

అవతల వాళ్లని నొప్పించి అయినా సరే విజయం సాధించాలి. తప్పు రైటో పక్కనబెడితే యాక్టివ్‌గా ఉండాలి. కానీ శివాజీ మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్నిరోజుల ముందు గేమ్ ఆడితే గాయపడ్డాడు. దీంతో హౌసులో ఉండటమైతే ఉన్నాడు గానీ బిగ్‌బాస్ శివాజీని అస్సలు కష్టపెట్టట్లేదు. దీంతో శివాజీకి చిరాకేస్తుంది. అదే విషయాన్ని చెబుతూ.. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, మీ ఇద్దరి ప్రశాంత్, యావర్ కోసమే ఉంటున్నాను అని యావర్‌తో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ ఇదే విషయాన్ని చెప్పారు.

శివాజీ అన్న మీరు ప్రశాంత్, యవర్‌కి సపోర్ట్ చేస్తున్నారని అంటే అతను మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడేమో ఏడుస్తూ అసలు నిజం బయటపెట్టేశాడు. దీంతో కంటెస్టెంట్ వాదించినదే చివరికి నిజం అయింది. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఏడో వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంట్ అంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఆ వార్తలపై స్పందిస్తూ మీరు ఎన్ని పేర్లు చెప్పినా కూడా బిగ్బాస్ తనకు ఎవరిని నచ్చితే వారిని ఎలిమినేట్ చేస్తారు ఏ విషయంలో ఆర్గుమెంట్స్ అనవసరం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందా లేకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -