Rathika-Prashanth: నువ్వు రైతుబిడ్డవే కాదు.. రతిక కామెంట్లతో పల్లవి ప్రశాంత్ పరువు పోయిందిగా!

Rathika-Prashanth: తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన బిగ్బాస్ షో ఇటీవలే మొదలవడంతో పాటు అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్ కూడా పూర్తి చేసుకుంది. కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారం ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మొదటివారం ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కంటెస్టెంట్ల మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ మొదలయ్యింది.

అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన నామినేషన్స్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కంటెస్టెంట్ లు ఒక రేంజ్ లో విచ్చుకుపడ్డారు. అంతేకాకుండా అమర్ అడిగిన ప్రశ్నలకు పల్లవి ప్రశాంత్ బిక్కమొహం వేయడంతో అందరూ చెప్పట్లతో ఎంకరేజ్ చేశారు. అసలు రైతుబిడ్డ అనేది లేకపోతే ప్రశాంత్ ఎవరు అని ముందుగా పల్లవి ప్రశాంత్‌ను ప్రశ్నించింది రతిక. నువ్వు రైతుబిడ్డ అనే సెంటిమెంట్ దారి ఎంచుకున్నావు. బిగ్ బాస్ అంటే అంత ఇష్టమయితే బిగ్ బాస్ ఎందుకు చూడలేదు? సీజన్స్ అన్నీ చూసి చాలా నేర్చుకొని వచ్చావు. నీలో బయట ఉన్న వినమ్రత అదంతా ఇక్కడ లేదు. ఇక్కడ నీలో ఉన్న ఇంకొక యాంగిల్ బయటికొస్తుంది.

అవకాశం వచ్చేవరకు ఒక ప్రశాంత్, అవకాశం వచ్చాక ఒక ప్రశాంత్‌లాగా ఉన్నావు. ఇలా ఉంటే బయట ఆడియన్స్ ప్రోత్సహించరు. రైతు అని నువ్వు ప్లే చేస్తున్న సెంటిమెంట్‌ను నమ్మడానికి ఎవరు పిచ్చివాళ్లు కాదు.నీ ఒరిజినాలిటీ తెలిస్తే వారే బయటికి పంపిస్తారు అంటూ ప్రశాంత్‌ను నామినేట్ చేసి వెళ్లిపోయింది రతిక. ఆ తర్వాత శుభశ్రీ వచ్చి ఒరిజినాలిటీ లేదని, బిగ్ బాస్ ఇచ్చే డబ్బు తీసుకోకుండా వెళ్లిపోతావా అని ప్రశ్నించింది. అవును తీసుకోను అని పల్లవి ప్రశాంత్ చెప్పిన సమాధానికి కంటెస్టెంట్స్ అంతా వ్యంగ్యంగా చప్పట్లు కొట్టారు. మొదట్నుంచి ఈ రతికాతో పులిహోర కలిపిన పల్లవి ప్రశాంత్ ఒక్కసారిగా ఆమె అసలు ఎవరు రైతుబిడ్డ అని ప్రశ్నలు వేయడంతో మనోడికి దిమ్మతిరిగిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -