Tarak-Prashanth: ప్రశాంత్ మూవీతో తారక్ ఆ రికార్డ్ సాధిస్తారా?

Tarak-Prashanth: సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్నది జూనియర్ ఎన్టీఆరే. ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాతో తొలి హిట్టు అందుకున్న తారక్.. ‘సింహాద్రి’, ‘ఆది’ సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయారు. ఆ తర్వాత ‘అదుర్స్’, ‘యమదొంగ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘బృందావనం’ లాంటి చిత్రాలతో యూత్ లో మరింత ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.
‘టెంపర్’ సినిమా తారక్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇక ఈ ఏడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్–3 గ్రాసర్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటిగా నిలిచింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. జపాన్ లోనైతే ఏకంగా రూ.20 కోట్లు వసూలు చేసి వహ్వా అనిపించింది.
‘ఆర్ఆర్ఆర్’ నెట్ ఫ్లిక్స్ లోనూ హవా చూపించింది. వరుసగా పలు నెలలపాటు నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో నిలిచి.. టాలీవుడ్ సత్తా చాటింది. తారక్ ఫైట్స్, డ్యాన్సులు, నటనకు ఇండియన్ ఆడియెన్స్ తోపాటు ఫారిన్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేసేందకు ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అంత టార్గెట్ రాబట్టేనా..?
కొరటాల సినిమా తర్వాత ‘కేజీఎఫ్​’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ మూవీ చేసేందుకు తారక్ రెడీ అవుతున్నారు. పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లునుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ మూవీ భారీ రెవెన్యూను టార్గెట్ చేస్తోందట. ఏకంగా రూ.4,000 కోట్ల టార్గెట్ తో ఈ సినిమాను బాక్సాఫీస్ బరిలో నిలపాలని నీల్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీంట్లో ఎంత నిజముందో మేకర్స్ కే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -