Shaakuntalam: శాకుంతలం సినిమాకు అలాంటి రెస్పాన్స్.. పాపం అర్హ అంటూ?

Shaakuntalam: స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం శాకుంత‌లం. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ బ్యానర్ల‌పై నీలిమ గుణ, దిల్ రాజు దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించారు.

ఈ మూవీలో మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గార‌ల ప‌ట్టి అల్లు అర్హ ఈ చిత్రంలో స‌మంత కుమారుడు లిటిల్ భ‌ర‌తుడి పాత్ర‌ను పోషించింది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

ప్రీమియర్లు వేయడం అన్నది నిజంగా మంచి స్ట్రాటజీనే. చాలా సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీ వర్క్ అయింది. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో టాక్ ను వేగంగా స్ప్రెడ్ చేయడానికి వీలవుతుంది. యూత్ కు అంతలా పట్టని సినిమాలు ప్రీమియర్లు వేయకూడదు. ఎందుకంటే బాగా నెగిటివ్ లాక్ వచ్చేస్తుంది.

ఇక్కడ దిల్ అన్న పట్టించుకోని విషయం ఒకటి ఉంది. అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. కనీసం పది శాతం అయినా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. కానీ పాపం పదిశాతం నెగిటివ్ కూడా వచ్చినట్లు ఉంది.

నిన్నటికి నిన్న జనరల్ పబ్లిక్ కు సినిమా వేసారు. కానీ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అంత ఇమ్మీడియటర్ రెస్పాన్స్ కనిపించలేదు. బహుశా యూనిట్ దీని మీద దృష్టి పెట్టి వుండకపోవచ్చు. కానీ నెగిటివిటీ మాత్రం బానే కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -