Gaalodu Review:సుడిగాలి సుధీర్ చేసిన ‘గాలోడు’ సినిమా ఎలా ఉందో తెలుసా? రివ్యూ ఇదే!

Gaalodu Review:

విడుదల తేదీ : నవంబర్ 18, 2022

నటీనటులు : సుధీర్ ఆనంద్, గెహ్నా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ

నిర్మాణ సంస్థ : సంస్కృతి ఫిల్మ్స్

నిర్మాత : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

దర్శకత్వం : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

ఎడిటర్ : ఎం ఎస్ ఆర్

సినిమాటోగ్రాఫర్ : అనీష్, వెంకట్ దీప్

బుల్లితెర మీద తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సుడిగాలి సుధీర్.. ‘గాలోడు’గా వెండి తెర మీద సందడి చేయడానికి థియేటర్లలోకి వచ్చేశాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించిన సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ‘గాలోడు’ సినిమా ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ :

ఓ పల్లెటూరిలో గాలికి తిరిగే కుర్రాడిగా సుడిగాలి సుధీర్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఈ సినిమాలో సుధీర్ రజనీకాంత్ అనే క్యారెక్టర్ చేశాడు. ఖాళీగా ఉండే రజనీకాంత్.. పేకాట ఆడుతూ ఆటలో గొడవ జరుగుతుంది. దీంతో రజనీకాంత్ ఆ ఊరి సర్పంచ్ కొడుకును కొడతాడు. దాంతో అతడు అక్కడికక్కడే చనిపోతాడు. ఈ కేసు తన మీదకు వస్తుందని రజనీకాంత్ ఊరు వదిలి సిటీకి వెళతాడు. అక్కడ హీరోయిన్ పరిచయం అవడం, కేసు విషయంలో ఎలాంటి మలుపులు ఉంటాయనేదే ఈ సినిమా స్టోరీ.

విశ్లేషణ :

సినిమా మొత్తం సుడిగాలి సుధీర్ ఇమేజ్ మీదనే ఉందని చెప్పుకోవాలి. పల్లెటూరి కుర్రాడికి, తనకు నచ్చిన అమ్మాయి కోసం తపించే లవర్ గా, తనకు వచ్చిన కష్టాన్ని ఎదురించి నిలిచే కుర్రాడిగా సుధీర్ బాగా నటించాడు. సినిమా కథ పరంగా రొటీన్ గానే ఉన్నా మధ్యలో అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులతో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

సినిమాలో హీరో సుధీర్ నటన పరంగా తన బెస్ట్ అందించాడనే చెప్పుకోవాలి. అలాగే హీరోయిన్ గా గెహ్నా సిప్పీ కూడా బాగా చేసింది. ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పుకోవాలి. మ్యూజిక్ ప్రేక్షకులకు బాగా అనిపిస్తుంది. కథలో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు సంతృప్తిని కలిగిస్తాయి. కథ పరంగా చూస్తే రొటీన్ స్టోరీనే డైరెక్టర్ సుధీర్ తో కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనీష్, వెంకట్ దీప్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సుధీర్ తొలిసారి చేసిన సినిమా చూడాలని అనుకొని, థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులకు సంతృప్తి అయితే లభిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

సుధీర్ నటన

డైలాగులు

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

బోరింగ్ గా అనిపించే ఫస్టాఫ్

సుధీర్ కోసం చూడగలిగే సినిమా ‘గాలోడు’

రేటింగ్ : 2.5/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -