Sudigali Sudheer: సుధీర్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడా.. వధువు ఆమేనా?

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు సుధీర్. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా డాన్సర్ గా, నటుడిగా, హీరోగా, మెజీషియన్ గా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రణ వేసుకున్నాడు సుధీర్. ఇక బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా లాంటి షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఇక సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఆ తర్వాత గాలోడు సినిమాతో సూపర్ హిట్ టాక్ ని అందుకున్నాడు. కాగా ఇటీవల కాలంలో సుడిగాలి సుధీర్ బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు. అందుకు గల కారణం వరుసగా సినిమాలలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సుడిగాలి సుధీర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే. సుధీర్ పేరు వినగానే ఆటోమేటిక్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ రష్మీ. ఇకపోతే సుధీర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త పెళ్లి ఎప్పుడు.

సుధీర్ ఎక్కడికి వెళ్లినా కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అయితే గతంలో సుధీర్ రష్మీకి రెండు మూడుసార్లు పెళ్లి చేసిన విషయం తెలిసిందే. అంత కేవలం స్క్రిప్టు మాత్రమే అని తెలియడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. రీల్ లైఫ్ లో ఒకటైన ఈ జంట రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైతే చూడాలని ఎంతో మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా మూడు పదుల వయసు దాటిపోయిన కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే బ్యాచిలర్ గా ఉన్నారు సుధీర్.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. సుధీర్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంట బయటా ఎక్కడ చూసినా కూడా సుధీర్ పెళ్లి టాపిక్ గురించి వస్తుండడంతో ఎట్టకేలకు సుధీర్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వధువు ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సుధీర్ వాళ్ళ రిలేషన్ లోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే పెళ్లికి సంబంధించిన విషయాలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -