Sudigali Sudheer: ఆ స్టార్ యాంకర్ ట్రాప్‌లో పడి సుడిగాలి సుధీర్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడా?

Sudigali Sudheer: బుల్లితెర స్టార్‌గా పేరు తెచ్చుతున్న సుడిగాలి సుధీర్ కెరీర్ పూర్తిగా డ్రాప్ అవుతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ ఉంటేనే బుల్లితెర షోలకు టీఆర్‌పీలు వచ్చేదనేలా క్రేజ్ ఉండేది. అంతలా క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ ఇప్పుడు అన్ని షోలకు దూరమయ్యాడు. ప్రస్తుతం కొన్ని షోలల్లో మాత్రమే నామమాత్రంగా కనిపిస్తున్నాడు. అయితే సుధీర్ కెరీర్ నాశనం కావడం వెనుక స్టార్ యాంకర్ ఓంకార్ హస్తం ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ బుల్లితెర స్టార్‌గా ఎదిగాడు. తనలో ఉన్న మల్టీ టాలెంట్స్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు పోవే పోరా, ఢీ, జబర్దస్త్ వంటి షోల ద్వారా స్టార్ ఈమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

కొన్నేళ్ల క్రితం స్టార్ట్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్‌గా కూడా పని చేశాడు. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో వచ్చే అన్ని షోలలో సుధీర్‌దే అప్పర్ హ్యాండ్ అన్నట్లుగా నడిచింది. కానీ ఊహించని విధంగా సుధీర్ ఒక్కో షోల నుంచి బయటికి రావడం మొదలైంది. మొదటగా ఢీ డ్యాన్స్ రియాలిటీ షో మానేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో సుధీర్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈటీవీ నుంచి బయటికి వచ్చిన సుధీర్ స్టార్ మాకు షిఫ్ట్ అయ్యాడు. యాంకర్‌ అనసూయతో కలిసి ఓ షోకి హోస్ట్ చేస్తున్నాడు. ఆ షో కూడా ఇటీవలే ముగిసింది. అయితే ఈ షోలను వదిలేయడానికి యాంకర్ ఓంకార్ హస్తం ఉందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఓంకార్ సలహా మేరకు సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచే సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనును అధిక రెమ్యూనరేషన్ ఎరగా వేసి ట్రాప్‌లోకి లాగేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సుధీర్ మాత్ర ఓంకార్ గాలానికి చిక్కాడని, అందుకే తన కెరీర్ నాశనం అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఒకప్పటి మల్లెమాల మేనేజర్ ఏడుకొండలు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా, బుల్లితెరతోపాటు సినిమాల్లోనూ సుధీర్ అలరించాడు. ప్రస్తుతం సుధీర్‌కు సంబంధించి కాలింగ్ సహస్ర, గాలోడు సినిమా షూటింగ్ నడుస్తున్నాయి. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -