Super Star: కృష్ణ జీవితంలో ఈ బాధాకరమైన ఘటనల గురించి తెలుసా?

Super Star: తెలుగు చిత్ర సీమలో అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న ఫాలోయింగ్ చూసి తాను కూడా అంతటి క్రేజ్ సంపాదించుకోవాలని సినిమాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి ఘట్టమనేని కృష్ణ. విచిత్రం ఏంటంటే.. అక్కినేని ఫ్యామిలీతో కలిసి కృష్ణ పలు సినిమాల్లో కూడా నటించారు. మంచి కుటుంబం, అక్కాచెల్లెలు, హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం వంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా 1972 సంవత్సరం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ ఏడాది ఆయన ఏకంగా 18 సినిమాల్లో నటించారు. కానీ బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అయిన తరహాలో కొన్నేళ్ల తర్వాత సూపర్‌స్టార్‌కు అసలు అవకాశాలు కూడా రాని సందర్భాలు ఉన్నాయి. 1991,1992 సమయంలో చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో కృష్ణ గడ్డుకాలం ఎదుర్కొన్నారు. అయినా అధైర్యపడకుండా సహనంతో మంచి అవకాశం కోసం ఎదురుచూశారు.

1992లో కృష్ణ నటించిన ఒక్క సినిమా మాత్రమే విడుదలైందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించిన పచ్చని సంసారం మూవీ కృష్ణకు మరోసారి బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీ 1993లో విడుదలైంది. ఈ చిత్రంలో కృష్ణ సరసన ఆమని హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ సూపర్ స్టార్ బిజీ అయిపోయారు. వారసుడు, రౌడీ అన్నయ్య, నంబర్ వన్, ఘరానా అల్లుడు, ఎస్ నేనంటే నేనే చిత్రాలు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టాయి.

సక్సెస్ ఉంటేనే చిత్ర పరిశ్రమలో విలువ

1991 సమయంలో తన చేతిలో ఒక్క సినిమా కూడా లేదని కృష్ణ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో సీనియర్ జర్నలిస్ట్ పీఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి సూపర్‌స్టార్ కృష్ణను కలవగా.. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే తన చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవని.. గంటల తరబడి మాట్లాడుకుందామని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే అందరూ వెంట పడతారని.. ఫ్లాపులు వస్తే పలకరించే నాథుడు ఉండడని చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఓ సందర్భంలో ఎస్పీ బాలు కూడా తన చిత్రాల్లో పాడనని చెప్పారని.. అప్పుడు తనకు చాలా బాధగా అనిపించేదని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కృష్ణ చెప్పడం గమనించాల్సిన విషయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -