Super Star: ఆ ఆరోగ్య సమస్యలు సూపర్ స్టార్ కృష్ణను వేధించాయా?

Super Star: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటి విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ దిగ్గజ నటుడు కృష్ణ అనారోగ్యంతో మృతి చెందాడు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల కృష్ణ మృతి చెందినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించాము. అక్కడ కృష్ణకు సీపీఆర్ నిర్వహించాము. చికిత్స కూడా ప్రారంభించాము. కానీ అప్పటికే కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 2, 3 గంటల తర్వాత ఆయన శరీరంలోని కొన్ని అవయవాలు పని చేయకపోవడం గమనించాము. 4 గంటల తర్వాత డయాలసిస్ కూడా చేశాము.’ అని తెలిపారు.

 

‘కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ కుటుంబ సభ్యులకు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. వైద్యులు ఎలాంటి పరీక్షలు నిర్వహించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉన్న కొంచెం టైంలో మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు తెల్లవారుజామున కృష్ణ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశాము.’ అని డాక్టర్ గురు వెల్లడించారు. కాగా, కృష్ణ మృతితో హీరో మహేష్ బాబు తీవ్రంగా కుంగిపోయారు. వరుసగా మహేష్ బాబు ఇంట ముగ్గురు కుటుంబసభ్యులు మరణించారు. జనవరి 8న మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. సెప్టెంబర్ 28న కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడం.. మహేష్ బాబుని మరింత విషాదంలోకి నెట్టింది. కృష్ణ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ మూగబోయింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -