Super Star Krishna: నరేష్ చేసిన పని వల్ల కృష్ణ ఆత్మ శాంతించదా!

Super Star Krishna: సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను సోమవారం నానక్‌రామ్ గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం కృష్ణ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి.. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అక్కడికి చేరుకుని కృష్ణ కుటుంబీకులను పరామర్శిస్తున్నారు. కృష్ణ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నారు.

 

ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమడి రామారావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకి అటెంట్ అయిన ఆయన కృష్ణ కుటుంబ విషయాల గురించి చెప్పుకొచ్చారు. కృష్ణ.. విజయ నిర్మలతో రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఇందిరాదేవి కండిషన్లు పెట్టిందన్న విషయాన్ని యాంకర్ అడగగా.. ఇమడి రామారావు సమాధానం చెప్పారు. ‘ఇందిరాదేవి-విజయ నిర్మల ఇద్దరూ అండర్‌ స్టాండింగ్‌తోనే ఉన్నారు.  అప్పటికే కృష్ణ-ఇందిరాదేవికి 5గురు సంతానం. రెండో పెళ్లి చేసుకున్నా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని ఇందిరాదేవి చెప్పారు. అలాగే విజయ నిర్మల పిల్లలు కనొద్దనే కండిషన్‌ను ఇందిరాదేవి పెట్టారు. దానికి విజయ నిర్మల కూడా ఒప్పుకుని పెళ్లి చేసుకున్నారని రామారావు తెలిపారు.

 

మహేష్ బాబు, సుధీర్ బాబు అంటే కృష్ణకు ఎంతో ఇష్టమని ఇమడి రామారావు అన్నారు. కానీ నరేష్ అంటే కృష్ణకు అస్సలు ఇష్టం లేదట. నరేష్ చేసిన పని వల్ల కృష్ణ తలదించుకున్నారని పేర్కొన్నారు. అంత్యక్రియలప్పుడు నరేష్ పవిత్రా లోకేష్‌ని తీసుకొచ్చారని, ఎంత సహజీవనం చేసినా ఇలాంటి సమయంలో అక్కడికి ఎలా తీసుకొస్తారని నిలదీశారు. నరేష్ చేసిన పని వల్ల కృష్ణ ఆత్మకు శాంతి కూడా చేకూరదని ఆరోపించారు. కాగా, పవిత్ర లోకేశ్-నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరూ హోటల్ రూమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం సెన్సెషనల్ అయింది. అప్పటినుంచి ఈ జంట వార్తల్లోనే నిలుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -