Mahesh Babu: మహేష్ బాబు మొదలుపెట్టిన కొత్త బిజినెస్ ఏదంటే?

Mahesh Babu: తెలుగులో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబు.. సినిమాలతో పాటు రకరకాలు వ్యాపారాలు చేస్తున్నాడు. తెలుగులో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న సినిమా హీరోల జాబితాలో మహేష్ బాబు కూడా టాప్ లో ఉంటాడు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ.50కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సినిమాలతో పాటు తెలుగులో వేరే ఏ హీరో చేయనన్ని యాడ్స్ మహేష్ బాబు చేస్తుంటాడు. అలాగే ఏసియాన్ సంస్థతో కలిసి ఏఎంబి సినిమాస్ ని మహేష్ బాబు రన్ చేస్తున్నాడు. టెక్స్ టైల్ బిజినెస్ లోనూ మహేష్ బాబు అడుగు వేసి.. మంచి బిజినెస్ చేస్తున్నాడు. అయితే తాజాగా మరో వ్యాపారంలోకి మహేష్ బాబు అడుగు పెట్టబోతున్నాడనే వార్త అందరికీ ఆసక్తిని రేపుతోంది.

మహేష్ బాబు త్వరలోనే హోటల్ బిజినెస్ ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారాన్ని తన భార్య నమ్రతా షిరోద్కర్ పేరుతో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నవంబర్ నెలలో మినర్వా ఎ.ఎన్ పేరుతో ఒక హోటల్ ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత డిసెంబర్ లో ప్యాలెస్ హైట్స్ పేరుతో మరో హోటల్ ని ప్రారంభించనున్నారట.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎండాకాలంలో విడుదల కానుంది. ఇది పూర్తైన తర్వాత రాజమౌళితో కలిసి భారీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -