Dandruff: చుండ్రును తరిమికొట్టే సూపర్ చిట్కాలు?

Dandruff: ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఈ కాలంగా చుండ్రు చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పదిమందిలో ఉన్నప్పుడు తల నుంచి చుండ్రు బాగా రాలినప్పుడు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే చుండ్రు కోసం మార్కెట్లో దొరికి ఎన్నో రకాల షాంపులను సోపులను ఉపయోగిస్తూ ఉంటారు. చుండ్రు కోసం ఖరీదైన ప్రొడక్ట్స్ నీ కూడా ఉపయోగిస్తుఉంటారు.

అయిన కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితం లేకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి చుండ్రు సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబంద సంప్రదాయ ఔషధం. కలబంద ఎన్నో రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అందం కోసం కలబందను ఉపయోగిస్తూ ఉంటారు. కలబంద జెల్ ను తీసుకుని నేరుగా జుట్టుకు అప్లై చేసి ఆ తర్వాత అరగంటకు తలస్నానం చేస్తే మీ జుట్టు చుండ్రు లేకుండా మృదువుగా కూడా ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో చర్మంతో పాటు ఊడిపోవడం సమస్య కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది.

అటువంటప్పుడు కొబ్బరి నూనె సహాయంతో చుండ్రు పోగొట్టుకోవచ్చు. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేస్తే చుండ్రు వెంటనే పోతుంది. పెరుగు జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది సహజమైన కండిషనర్ గా పని చేసి జుట్టు సమస్యలను పోగొడుతుంది. పెరుగును జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. అంతేకాదు జుట్టు మెరుస్తుంది. అదేవిధంగా మెంతుల మాస్క్ కూడా శీతాకాలంలో జుట్టు సమస్యలను పోగొడుతుంది. మెంతులను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ లాగా చేసి నిమ్మరసం కలిపి అప్లై చేసి 1 గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -