Suprita: పెళ్లి చేసుకుందామా అని అడిగిన నెటిజన్ కు షాక్ ఇచ్చిన సురేఖ వాణి కూతురు!

Suprita: టాలీవుడ్ ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించిన సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె ఎన్నో సినిమాల్లో హీరో అక్కగా, పిన్నిగా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈమె హీరో అక్క పాత్రలో పోషించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇలా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి నటిగా ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ప్రస్తుతం కొంతకాలంగా సినిమాల కు దూరంగా ఉంటున్న సురేఖ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి సురేఖ వాణి కి సినిమాల పరంగా కంటే సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక తనతో పాటు తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి నెట్టింట్లో చిందులు వేస్తూ ఉంటారు. వీరిద్దరని చూసిన నెటిజన్లు తల్లి కూతుర్ల కంటే అక్క చెల్లెలు గా భావిస్తూ ఉంటారు.

ఈ రకంగా వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ నెటిజన్ల ను ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సుప్రీత సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది. సుప్రీత వెండితెరకు పరిచయం కాకముందే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా సుప్రీత నెటిజన్ల తో చిట్ చాట్ సెక్షన్ ను ప్రారంభించింది. ఈ చిట్ చాట్ లో నెటిజన్లు సుప్రీతను అనేక రకాలుగా ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు తగ్గట్టుగా సుప్రిత కూడా సమాధానం ఇచ్చింది.

ఇక ఇదే క్రమంలో సుప్రిత ను ఒక నెటిజన్ పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. దానికి సుప్రిత తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. ఈ విషయం గురించి మా అమ్మకి చెబుతా ఆ తర్వాత నీ సంగతి చెబుతుంది. ఆ తర్వాత నాకు తెలియదు తెలిసినా నాకు సంబంధం లేదు భయ్యా అని సుప్రీత తనదైన స్టైల్ లో ఆ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ మెడకు చుట్టుకుంటున్న చెల్లి చీర.. ఆ కామెంట్లు నిండా ముంచేసేలా ఉ

 Pawan Kalyan: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల పర్యటనలు జోరు అందుకున్నాయి. ప్రతిపక్షాల లోటుపాట్లను ఎత్తిచూపుతూ, తాము సాధించబోయే అభివృద్ధి గురించి ప్రసంగిస్తూ రాజకీయ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా పవన్...
- Advertisement -
- Advertisement -