YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న సర్వేలు.. ప్రతి సర్వే ఓటమే అంటూ?

YCP: ఏపీ ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇంకా షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వకపోయినా.. ప్రతీ రోజు క్లైమాక్స్ ను తలపించేలా అక్కడి రాజకీయాలు మారుతున్నాయి. దీంతో, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్యూరియాసిటీ నేపథ్యంలో పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇండియా టుడే సీ ఓటర్ కలిసి ఓ సర్వే చేశాయి. ఈ సంస్థలు అధికార వైసీపీకి షాక్ ఇచ్చాయి.

 

ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని.. వై నాట్ 175 అంటున్న జగన్ కు వరుస సర్వేలు షాకులు మీద షాకులు ఇస్తున్నాయి. ఇండియా టుడే సర్వే ఫలితాలతో వైసీపీ నేతలు తర్జనభర్జన అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 17 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. వైసీపీ 8 స్థానాలుకే పరిమితం అవుతుందని చెప్పింది. ఇక ఓట్ షేరింగ్ కూడా వైసీపీకి భారీగా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి సుమారు 50 శాతం ఓట్లు వచ్చాయి. కానీ, ఈ సారి ఏకంగా 9 శాతం పడిపోతాయని ఇండియా టుడే సర్వే చెబుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 41 శాతం ఓట్లు పడతాయని ఈ సర్వేలో తేలింది. ఇక, టీడీపీ, జనసేన కూటమికి 45 శాతం ఓట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. అంటే.. వైసీసీ కూటమితో పోల్చుకుంటే.. 4 శాతం ఓటింగ్ లో వెనకబడింది. ఈ నాలుగు శాతం ఓటింగే వైసీపీ కొంపముంచుతుందని తెలుస్తోంది. 2019కంటే ఈసారి వైసీపీ ఓట్లు తగ్గుతాయి. అంతేకాదు.. 2014లో కంటే వచ్చిన ఓట్లు కూడా ఈ సారి రావని ఈ సర్వే లెక్కలు చెబుతున్నాయి.

మొత్తానికి వైసీపీ వై నాట్ 175 అంటున్న గౌవరమైన స్థానాలను గెలుచుకోవడానికే కష్టపడాల్సి వస్తుంది. అయితే, ఈ సర్వేపై వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. ఇదో పెయిడ్ సర్వే అని సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. 2019లో కూడా ఇండియా టుడే ఇలాంటి సర్వే ఫలితాలు ఇచ్చిందని అప్పుడు ఆ సర్వే తప్పని ఏపీ ప్రజలు నిరూపించారని సజ్జల అన్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని జోస్యం చెప్పారు.

 

మొత్తానికి వైసీపీ నేతల తీరు అనుకూలంగా ఉంటే ఒకలా.. వ్యతిరేకంగా ఉంటే మరోకలా ఉంది. ఆ మధ్య టైమ్స్ నౌ సర్వే ఒకటి వచ్చింది. ఆ సర్వేలో 24 ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని తేలింది. మరొక స్థానంలో హోరాహోరీగా పోరు ఉంటుందని చెప్పింది. అలా సత్యదూరంగా ఉన్న సర్వే ఫలితాలను అయితే, వైసీపీ నేతలు నెత్తిన పెట్టుకుంటారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ఫుల్ కాన్ఫిడెంట్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది కూడా వాస్తవానికి దగ్గరగానే ఉందట. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే 45 శాతం ఓట్లు వస్తాయని చెబితే అది వాస్తవానికి దూరంగా ఉందని వైసీపీ నేతలు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది.

 

ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు. ఎలా చూసినా ఇంకా ఎన్నికలకు 3 నెలలు సమయం పడుతుంది. ఈ మూడు నెలల్లో వ్యూహాలు మార్చి ముందుకు వెళ్తే ఫలితాలు అనుకూలంగా రావొచ్చు. ఇండియా టుడే సర్వే బట్టి చూస్తే ఇంత వ్యతిరేకతలో కూడా వైసీపీ అతిపెద్ద పార్టీగానే ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓట్ షేరింగ్ తేడా జస్ట్ 4 పర్సంట్. ఎన్నికలకు వారం రోజులు ముందు వ్యూహాలు మూడు నుంచి నాలుగు శాతం ఓటర్లను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాస్తవాలను గ్రహిస్తే మంచిది. కానీ, వైసీపీ వాస్తవాలను అర్థం చేసుకోవడానికి సిద్దంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా సర్వేలు చెప్పినా వారిపై బురద జల్లుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -