SuryaKumar: టీమిండియా యువ ఆటగాడి ఒంటిపై అన్ని టాటూలు ఉన్నాయా?

SuryaKumar: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియా మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న అతడు మైదానంలోని అన్ని వైపులకు తనదైన రీతిలో షాట్లు ఆడగలడు. అప్పర్ కట్, ర్యాంప్, ఆన్‌సైడ్ ఔట్ డ్రైవ్, లాఫ్ట్, స్కూప్, స్వీప్, రివర్స్ స్వీప్ ఇలా అన్ని రకాల షాట్లు సూర్య అమ్ములపొదిలో ఉన్నాయి. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో మొదటి బంతినే సిక్సర్‌గా మలిచిన ఘనత సూర్యకుమార్ సొంతం.

కానీ ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన సూర్యకుమార్ ఆలస్యంగా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే సూర్యకుమార్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. సూర్యకుమార్ ఒంటిపై దాదాపు 20 పచ్చబొట్లు ఉన్నాయి. ఒక టాటూలో తల్లి పేరు స్వప్న.. మరోవైపు నుంచి చూస్తే తండ్రి పేరు అశోక్ కనిపిస్తాయి. సూర్యకుమార్ తన తల్లిదండ్రుల ముఖాలను భుజాలపై టాటూగా వేయించుకున్నాడు. అంతేకాకుండా జీవితాన్ని ఎలా మలుచుకుంటావో నీ చేతుల్లోనే ఉంది.. కానీ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్ అని కూడా టాటూగా రాయించుకున్నాడు. సూర్య టాటూల్లో పక్షి, పువ్వు, బాణంతో పాటు భార్య దేవిషా పేరు కూడా ఉంటాయి. ఈ మధ్యే దిష్టి కన్ను కూడా టాటూగా వేయించుకున్నాడు.

2016లో సూర్యకుమార్‌కు వివాహం జరిగింది. అతడి భార్య పేరు దేవిషా. విచిత్రం ఏంటంటే.. వీళ్లిద్దరూ ముంబైలోని ఆర్ ఏ పోధార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. దేవిషా మంచి డ్యాన్సర్. ఆమె డ్యాన్స్ అంటే సూర్యకు ఎంతో ఇష్టం. కాలేజీలో చదివే రోజుల నుంచే సూర్యకుమార్ బ్యాటింగ్‌కు దేవి ఛీర్ లీడర్. ఆమె గతంలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేది. సూర్యకుమార్‌కు ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు దినాల్.

ఐపీఎల్‌తోనే గుర్తింపు
సూర్యకుమార్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ద్వారా రాని గుర్తింపు ఐపీఎల్‌తో వచ్చింది. రూ.10 లక్షలతో 2011లో అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ సీనియర్ ఆటగాళ్ల కారణంగా జట్టులో ప్లేస్ దొరకలేదు. ముంబై జట్టులో మూడు సీజన్‌ల పాటు ఉన్నా రెండు, మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.70 లక్షలకు సూర్యను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో కేకేఆర్ టైటిల్ గెలవడంతో సూర్య కీలకపాత్ర పోషించాడు. సూర్య జోరు చూసి 2018లో మళ్లీ ముంబై అతడిని రూ.3.2 కోట్లకు కొనుగోలు చేయగా ప్రస్తుతం అతడికి రూ.8 కోట్లు చెల్లిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -