Kasani Gnaneshwar: టిటిడిపికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా.. తెలంగాణ టీడీపీకి ఇది భారీ షాక్ అంటూ?

Kasani Gnaneshwar: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీలోకి దిగబోతుంది అంటూ గతంలో చంద్రబాబు నాయుడు కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణలో పోటీ చేయడం కోసం పెద్ద ఎత్తున పలు గ్రామాలలో పర్యటించి తెలుగుదేశం పార్టీ కోసం పని చేశారు ఇలాగ ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం తెలంగాణలో పని చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి.

తాజాగా జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేయబోతున్నానని ప్రకటించడంతో ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే ఈయన రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలలో పోటీ చేయడం కోసం గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీని ముందుకు నడిపించడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసామని కాసాని వెల్లడించారు.

ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మేము ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అన్న విషయాలను గురించి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి ఏ విధమైనటువంటి సమాచారం లేదు గతంలో నేను చంద్రబాబు నాయుడు లోకేష్ ని కలిసిన వారి దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఈ విషయం గురించి మాట్లాడే వారే లేరు.

ఇక తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో కూడా పుంజుకోవాలని తాము కష్టపడుతూ ఉండగా చంద్రబాబు నాయుడు కొంతమందికి మాత్రం కాంగ్రెస్కు ఓట్లు వేయాలని చెప్పినట్లు తెలియడంతో తెలుగుదేశం పార్టీ నేతలలో తీవ్రస్థాయిలో అసహనం నిండిపోయింది అని తెలిపారు. ఇలా ఎన్నికల బరిలో దిగడం కోసం పార్టీ నుంచి 30 మందిని కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వారికి బి ఫాం ఇవ్వలేదు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగబోతున్నామని అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ నుంచి ఏ విధమైనటువంటి స్పష్టత రాకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా కాసాని పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాకింగ్ విషయమే అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -