Amala Akkineni-Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా.. అభిమానులు ఎప్పటికీ క్షమించలేరా?

Amala Akkineni-Jr NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదే ఊపుతో దేవర మూవీలో నటిస్తున్నారు. ఇకపోతే ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

ఈ మూవీ కోసం తారక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే.. ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో అందరితో చనువుగా స్నేహపూర్వకంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఎంత మంచిగా ఉన్నప్పటికీ కొందరు కావాలని సెలబ్రిటీలు ఎన్టీఆర్ ని దూరం పెడుతూ ఉంటారట. ఆ లిస్టులోకే వస్తుంది నాగార్జున భార్య అమల అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అమల ఎన్టీఆర్ విషయంలో చేసిన తప్పు ఇప్పటికి అభిమానులు మర్చిపోలేకపోతున్నారు అన్న విషయం ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది.

నిజానికి మనం సినిమా కథ అనుకున్నప్పుడు అక్కినేని నాగచైతన్య ప్లేస్ లో ఎన్టీఆర్ ని మొదటగా అనుకున్నారట. అసలు ఈ సినిమా టోటల్ అక్కినేని ఫ్యామిలీ కాన్సెప్ట్ తో తెరరకెక్కించాలని అనుకోలేదట. ఒక్కొక్కరిని ఒక్కొక్క హీరో జోనర్ నుంచి తీసుకుందాం అన్న భావనలో డైరెక్టర్ ఉన్నారట. అయితే అమల మాత్రం నాగేశ్వరరావు నాగార్జున నటిస్తున్నప్పుడు ఆ ప్లేస్లో అఖిల్ ఎందుకు ఉండకూడదు? అఖిల్ నటిస్తే అఖిల్ కెరీర్ కి కూడా ప్లస్ అవుతుంది అన్న విధంగా ఆలోచించి ఈ కథలో ఎన్టీఆర్ ని తీసేయండి అఖిల్ ని పెట్టుకోండి అంటూ సలహా ఇచ్చిందట.

అయితే ఆ సలహా ఇష్టం లేకపోయినా డైరెక్టర్ అలాగే చేశారు. కానీ నాగేశ్వరరావు అక్కినేని అఖిల్ కన్నా ఆ పాత్రను నాగచైతన్య పెడితే ఇంకా బాగుంటుందని అఖిల్ ని లాస్ట్ మూమెంట్లు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ చేస్తే టోటల్ సినిమా మొత్తం మన సినిమాగా ఉంటుంది అంటూ చెప్పుకు వచ్చారట. అలా మంచి సినిమాను అమల ఎన్టీఆర్ ఖాతాలో పడనీకుండా చేసింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది తెలిసిందే. నిజంగా ఏఎన్నార్ తో ఎన్టీఆర్ నటించి ఉంటే ఆయన కెరియర్ ఇంకా హై స్థానంలో ఉండేది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -