FirstNight: ఫస్ట్‌నైట్‌కు ప్రిపేర్‌ అయిన భర్త.. వధువు రాకతో షాక్‌.. ఏమైందో తెలుసా?

FirstNight: టెక్నాలజీ పెరిగే కొద్ది మోసాలు కూడా పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని మోసాలు, బెదిరింపులకు తెర లేపుతున్నారు. అయితే ఇతగాడు చేసిన మోసానికి ఓ యువకుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లబోదిబోమంటున్నాడు. సోషల్ మీడియాలో ఓ యువతి ఫొటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది..వచ్చిన తడువుగా ఆ యువకుడు యాక్సెప్ట్ చేశేవాడు. ఆ తర్వాత మెసెజ్‌లు, చాటింగ్‌లతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలకు చెప్పకుండానే ఓ గడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కొడుక్కి ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకుంది యువతిని కాదని.. యువకుడి (నపుంసకుడు) ని అని తెలిసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వారలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లక్సర్‌లోని రైసీ చౌడీ గ్రామంలో నివసిస్తున్న యువకుడికి సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో పరిచయం అయిందని పోలీసులు తెలిపారు. వాస్తవానికి యువతి పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా.. దానిని యువకుడు యాక్సెప్ట్ చేశాడని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ మొదలైందన్నారు. ఇద్దరూ నంబర్లను ఇచ్చికుని ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి బంధం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. తమది హర్యానాలోని హిసార్ నగరమని కలకాలం కలిసి జీవించాలని చెప్పడంతో యువకుడు కూడా అంగీకరించాడు.

 

ఆ తరువాత ఇద్దరూ కలిసి లక్సర్‌కు ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తెలిపారు.పెళ్లి తర్వాత యువకుడు భార్యను గ్రామంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజు.. తాను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు.. అబ్బాయినని తెలియడంతో షాకై ఇక్కడి నుంచి వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ క్రమంలో వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా.. తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ నిందితుడు డిమాండ్ చేయడంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -