Taman: అచ్చం తమన్ లానే.. మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఫోటోలు వైరల్!

Taman: సినీ ప్రియులకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు తన సంగీతాన్ని అందించి తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. పలు స్టార్ హీరోల సినిమాలకు తన సంగీతాన్ని అందించి మ్యూజికల్ హిట్ ను దక్కించుకున్నాడు తమన్.

అఖండ సినిమాలో తన అద్భుతమైన సంగీతాన్ని అందించి బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక సర్కారు వారి పాట సినిమాకు తన సంగీతాన్ని అందించి తెలుగు ప్రేక్షకుల విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. ఇక తమన్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక తమన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంటాడు. ఇప్పటివరకు ఫ్యామిలీ గురించి ఏ విషయాలు పంచుకోని తమన్ తన భార్య, కొడుకు గురించి ఆ మధ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు.

పైగా రాబోయే కాలంలో ఆమెతో కలిసి స్టేజ్ షో చేయాలని ఉంది అని తమన్ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా తన కొడుకుకు సంబంధించిన ఫోటో పంచుకున్నాడు తమన్. నిజానికి ఇప్పటివరకు తమన్ తన కొడుకుని పరిచయం చేయకపోగా తాజాగా ఫోటో పంచుకొని అతడిని పరిచయం చేశాడు.

తన తల్లి 70వ పుట్టినరోజు సందర్భంగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇక తన కొడుకు పేరు అజిత్ అని ప్రస్తుతం అతడు ఇంటర్ చదువుతున్నాడని తెలిసింది. ఈరోజు తమన్ వాళ్ల తల్లి పుట్టిన రోజు సందర్భంగా తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ తమన్ కొడుకు అచ్చం తమన్ పోలిక లతో ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -