Tamannaah: నా తల్లీదండ్రులే అలా అడగలేదు.. నువ్వెవరివి అడగటానికి.. తమన్నా సంచలన వ్యాఖ్యలు!

Tamannaah: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాకుండా పలు రకాల బ్రాండ్లకు తమన్నా అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో తమన్నా డేటింగ్, పెళ్ళికి సంబంధించిన వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కాగా తాజాగా ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొంది తమన్నా.

అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. అయితే పెళ్లి గురించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్‌ మీట్‌లో తమన్నా ఇటీవల పాల్గొన్నారు. నెగెటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు? అని ఒక అభిమాని ప్రశ్నించగా.. వ్యతిరేకత, విమర్శలు వచ్చినప్పుడు.. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తాం. కొంతమంది ప్రశంసిస్తారు.. మరికొంత మంది విమర్శలు చేస్తారు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి చింతించాల్సిన అవసరం లేదు. వ్యతిరేకతను నేను ఎక్కువగా పట్టించుకోను అని ఆమె తెలిపారు.

ఇంతలో మరో నెటిజన్‌.. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? తమిళనాడుకు చెందిన అబ్బాయిలు మీకు నచ్చలేదా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు తమన్నా ఒకింత అసహనానికి లోనయ్యారు. నా తల్లిదండ్రులే ఇలా నన్నెప్పుడూ అడగలేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది తమన్నా.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -