Tamannaah: తమన్నా ఇన్ని రూ.కోట్లు వెనకేసిందా.. ఆమె ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో అంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. 25వ సంవత్సరంలో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి తమన్నా దాదాపు దశాబ్దన్నర కాలంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఇప్పటికీ హీరోయిన్ గానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా హీరోయిన్ గా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇందులో రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ కాగా భోళా శంకర్ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. అయితే కెరియర్ పరంగా తమన్న మాత్రం ఎంతో బిజీగా ఉంటూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఒక్కో సినిమాకు ఈమె నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అదేవిధంగా స్పెషల్ సాంగ్ కోసం 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

 

ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.వీటితోపాటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా తమన్న సందడి చేస్తున్నారు. ఇలావచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈమె భారీ స్థాయిలోనే ఆస్తులను పోగు చేశారని తెలుస్తుంది.

 

ఇలా 17 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి తమన్నా ఇప్పటివరకు ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించిందనే విషయం గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.చెన్నై తో పాటు ముంబైలో కూడా ఓన్ ప్లాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. అలాగే లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట ఇలా వీటన్నింటి విలువ కలిపి సుమారు 120 కోట్ల వరకు ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -