Bhola Shankar: భోళా శంకర్ కు ఆమె శనిలా ఉందా.. ఆమె వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందా?

Bhola Shankar: మొహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తమన్నా కలిసి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ మూవీ రేపు అనగా ఆగస్ట్ 11 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అంతేకాకుండా ఇవి సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. సినిమా విడుదల కావడానికి కేవలం మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ గురించి హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. కాగా కీర్తి సురేష్ రజినీకాంత్ కాంబోలో వచ్చిన సినిమా పెద్దన్న. ఈ సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ కు సిస్టర్ గా నటించింది. ఈ సినిమాలో నయనతార కూడా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలిగా నటించగా ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. భోళా శంకర్ సినిమాలో కూడా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిచింది.

 

ఈ విషయం పట్ల అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుంది అంటున్నారు జనాలు. ఒకవేళ అదే గనుక నిజమైతే, కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ గనుక రిపీట్ అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడం ఖాయం అని తెలుస్తోంది. మరి సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుంది అన్నది తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -