Tamannaah: అంతమంది హీరోలతో నటించినా తమన్నా కోరిక తీరలేదా.. అసలేం జరిగిందంటే?

Tamannaah: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో అందరి హీరోల సరసన నటించారు. ఇక ప్రస్తుతం తమన్న సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఈమె భారీ స్థాయిలో గ్లామర్ షో చేయడమే కాకుండా ఏకంగా బెడ్రూమ్ సన్ని వేషాలలో కూడా నటిస్తూ రచ్చ చేస్తున్నారు.

వెబ్ సిరీస్ లలో దారుణంగా నటిస్తున్నటువంటి ఈమెకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో తన డ్రీం ప్రాజెక్టులో నటించాలని కోరిక తీరలేదట ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించినటువంటి ఈమెకు ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలలో నటించే సినిమా అవకాశాలే వస్తున్నాయి కానీ అనుష్క నటించిన అరుంధతి తరహా లాంటి సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో ఈమెకు కోరిక ఉందట.

ఇలా అరుంధతి సినిమా ద్వారా అనుష్కకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె కూడా అలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించాలని ఎప్పటినుంచో కలలు కంటునప్పటికీ ఆ కోరిక మాత్రం ఇప్పటికీ తీరలేదని చెప్పాలి తమన్న మొదటి నుంచి కూడా కాస్త గ్లామర్ షో చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు అలాగే డైరెక్టర్లు కూడా ఈమె వద్దకు అలాంటి కథలతోనే వెళ్తున్నారు.

ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ కథల ద్వారా ఎవరు తన వద్దకు వెళ్లలేదని ప్రతి ఒక్క దర్శకుడు కూడా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నటువంటి కథలతోనే తన వద్దకు వెళుతున్నారు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇలాంటి సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో ఈమె కూడా వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా వాటిలో నటిస్తున్నారని తెలుస్తోంది. మరి తమన్నా తన మనసులో కోరికను బయటపెట్టిన తరువాత ఆయన తనకు అలాంటి సినిమాలలో అవకాశం వస్తుందో రాదో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -