Vijay: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సంచలనాలు సృష్టిస్తారా?

Vijay: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరో విజయ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన రాజకీయాలలోకి వస్తారంటూ వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగానే విజయ్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం కోసం విజయ్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో భాగంగా విజయ్ రంగంలోకి దిగబోతున్నారని అందుకే ఇప్పటినుంచి రాజకీయాలలో బిజీ కానున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే విజయ్ పాదయాత్ర కూడా ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారట.

ఈ విషయం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతుంది. అయితే రాష్ట్రం మొత్తం ఒకేసారి ఈయన పర్యటన చేయకుండా కొన్ని దశలవారీగా కొన్ని నియోజకవర్గాలలో పర్యటన చేయాలని భావించారట ఇలా ప్రజలలోకి వెళ్తే ప్రజా సమస్యలు తెలుస్తాయని తద్వారా మేనిఫెస్టో తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుందని విజయ్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన త్వరలోనే పాదయాత్ర ప్రారంభించబోతున్నారని సమాచారం.

 

ప్రస్తుతం లియో సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నటువంటి విజయ్ ఈ సినిమా విడుదల అయ్యేలోపు మొదటి దశ పాదయాత్రను పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. అనంతరం ఈయన డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తమిళనాడు రాజకీయాలలో కొనసాగబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఈయన కనుక రాజకీయాలలోకి వస్తే సీఎం అవ్వడం ఖాయం అంటూ అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -