Tammareddy Bharadwaja: వైరల్ అవుతున్న తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు!

Tammareddy Bharadwaja: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాలలోనే ఈయన బాగా హైలైట్ అవుతూ ఉంటారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఏపీలోని పలు పార్టీల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

 

ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నా కూడా చాలా మంది బయటకు అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారు అని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దేశంలో మహిళలు, దళితులు, మైనారిటీలపై దౌర్జన్యాలు పెరిగాయని రక్షణ కరువైందని ఆయన అన్నారు. మణిపూర్‌లో అంత దారుణం జరిగితే 70 రోజుల తర్వాత కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొందని ఆయన మంది పడ్డారు. ఆ ఘటనలపై ఎదురు దాడి చేయడం చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. పద్మావతి అనే సినిమా సీఎంకు వ్యతిరేకంగా ఉందని ఆరోజు అడ్డుకున్నారని తమ్మారెడ్డి అన్నారు.

ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధానాన్ని ఖండించలేదన్నారు. ఆడవాళ్లను గౌరవించని, దళితులను గౌరవించని బీజేపీ తనకు అక్కర్లేదన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా తెలుగు వాళ్లను మోసం చేసిన బీజేపీ అవసరమా? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ హఠావో, అక్కర్లేదని, ఏపీలో బీజేపీని అసలు రానివ్వరు అని అన్నారని కానీ ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు మాత్రం ముసుగు వేసుకుని బీజేపీని సపోర్టు చేస్తున్నాయని అన్నారు. కాబట్టి ఇటువంటి వారిలో మార్పు అయినా రావాలి లేదంటే ప్రజలే ఓడించాలని తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. కాగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -