RRR: అరుదైన ఘనతతో ఎంతో ఎదిగిన తారక్, చరణ్.. అసలేమైందంటే?

RRR: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా గతేడాది విడుదలై సంచలనాలు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ సినిమా చూసిన దేశీయ సినీ ప్రముఖులతో పాటు విదేశాలకు చెందిన సినీ ప్రముఖుల సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ప్రజల ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం కి మరొక అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ టీం కి ఆస్కార్ అవార్డు వరించిన సంగతి అందరికీ తెలిసిందే.

 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది.ఆర్ఆర్ఆర్ కి ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు దక్కటంతో యావత్ భారత ప్రజల సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ టీం కి మరో అరుదైన గౌరవం లభించింది. ఈ సినిమాకి చెందిన ఆరుగురికి ఆస్కార్‌ కమిటీలో అవకాశం లభించింది.

 

ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు చెందిన ఆరుగురుకి కూడా సభ్యత్వం కల్పించింది. మన హీరోలు రామ్‌ చరణ్‌ , ఎన్టీఆర్‌తో పాటు కీరవాణి కూడా ఈ కమిటీలో సభ్యులుగా స్థానం దక్కింది. అలాగే గేయ రచయిత చంద్రబోస్‌ తో పాటు ఛాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -