Balayya-Tarak: బాలయ్య కోసం సినిమాలు వదిలేస్తానన్న తారక్.. ఏమైందంటే?

Balayya-Tarak: తెలుగు వారి కీర్తిని, తెలుగు సినిమా పేరును ఎల్లలు దాటించిన ఘనత నందమూరి తారకరామారావుకు దక్కుతుంది. మద్రాసీలుగా పిలిచిన తెలుగు వారిని గర్వంగా తెలుగు వాళ్లని పిలిచేలా చేసిన నందమూరి తారకరామారావు.. సినీ లోకంలో ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకులకు దేవుడిగా మారాడు. అలాంటి నందమూరి కుటుంబం నుండి నట వారసత్వాన్ని పుచ్చుకొని చాలామంది నటులు తమ సినీ ప్రస్థానాన్నికొనసాగిస్తున్నారు.

 

తన తండ్రి నందమూరి తారకరామారావు నుండి వచ్చిన నట వారసత్వాన్ని నందమూరి బాలయ్య కొనసాగిస్తుండగా.. మూడో తరంలో నందమూరి కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కొనసాగిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు నందమూరి కుటుంబం సహాయ సహకారాలు అందలేదనేది అందరికీ తెలిసిన నిజం. జూనియర్ ఎన్టీఆర్ తన ట్యాలెంట్ ను నిరూపించుకొని ఓ స్థాయికి వచ్చాక నందమూరి అండ దొరికింది.

 

నందమూరి బాలయ్య ముందుగా యంగ్ టైగర్ తారక్ ను హక్కున చేర్చుకున్నట్లు సమాచారం. అందుకే తన తండ్రి తర్వాత నందమూరి బాలయ్యకు తారక్ ఎక్కువ గౌరవ, మర్యాదలు ఇస్తాడని తెలుస్తోంది. తన కుటుంబానికి అండగా నిలుస్తున్న నందమూరి బాలయ్య అడిగితే జూనియర్ ఎన్టీఆర్ ఏదీ కానదనడు అని సమాచారం. గతంలో బాలయ్య గురించి ఎన్టీఆర్ చేసిన ఓ కామెంట్.. బాబాయ్ మీద తారక్ కు ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తోంది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో అతడిని ఓ మీడియా వ్యక్తి.. ‘మీకు సినిమాలు ముఖ్యమా? బాబాయ్ ముఖ్యమా?’ అని ప్రశ్నించాడట. ఈ ప్రశ్నకు తారక్ మరో ఆలోచన లేకుండా బాబాయ్ ముఖ్యమని టక్కున చెప్పేశాడట. అంటే తన బాబాయ్ నందమూరి బాలయ్య కోసం తారక్ సినిమాలు వదిలెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని, తన బాబాయ్ అంటే అంత ప్రేమ అనే విషయాన్ని ఒక్క స్టేట్మెంట్ లో జూనియ్ ఎన్టీఆర్ చెప్పేశాడు. గతంలో చెప్పిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -