Tarak: ఆ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తానన్న తారక్.. కానీ?

Tarak: ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అవతారమెత్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా వరల్డ్ వైడ్ హిట్ అందుకోవడంతో సినిమా స్టోరీల ఎంపిక విషయంలో ఎన్టీఆర్.. ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎలాంటి అప్‌డేట్ లేదు. గత కొంతకాలంగా షూటింగ్‌లకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. దాంతో చాలా మంది తారక్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

 

 

కానీ ఎన్టీఆర్ ప్లానింగ్ వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. టాప్ డైరెక్టర్లు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ రెండు సినిమాల్లో నటించనున్నారు. ఈ సినిమా స్టోరీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే సినిమా స్టోరీ ఎంపిక విషయంలో వేగం తగ్గినా పర్వాలేదని, కానీ తాను హీరోగా నటించే సినిమాలు రికార్డు బ్రేకింగ్ సినిమాలుగా నిలవాలని తారక్ ప్లాన్ చేస్తున్నారట.

 

 

దీని కోసం తారక్ దర్శకులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారని సమాచారం. అలాగే ఆయా దర్శకులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారట. పక్కా ప్రణాళికతోనే ఎన్టీఆర్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన దగ్గర స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్లకు.. కథ సాధారణంగా ఉందని అనిపిస్తే నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

 

 

అయితే డైరెక్టర్ బుచ్చిబాబు.. తారక్‌కు ఓ కథ చెప్పాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కాలంటే మరో రెండేళ్ల పాటు సమయం పడుతుంది. అది తారక్‌కు ఇష్టం లేక.. బుచ్చిబాబు-రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తారక్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అటు ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. కానీ, వచ్చే ఏడాది వరుస అప్‌డేట్స్ తో తారక్ సినిమాలు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్లు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు 2023లో విడుదల కానున్నాయి. తారక్ పుట్టినరోజు వరకు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -