CM KCR: కేసీఆర్ టార్గెట్ గా ఐటీ దాడులు? మోదీ-అమిత్ షా ప్లాన్ అదేనా?

CM KCR: మొన్న వాసవి.. నిన్న ఫీనిక్స్.. తెలంగాణలో ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ కంపెనీల వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే వార్తలు సంచలనం రేపుతోన్నాయి. సీఎం కేసీఆర్ టార్గెట్ గానే మోదీ-అమిత్ షా డైరెక్షన్ లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంపై గట్టిగా విమర్శలు చేస్తున్న కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుక ఐటీని తెలంగాణలో కేంద్రం రంగంలోకి దిపిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే అధికార పార్టీ నేతలు, ప్రభుత్వతో సంబంధమున్న మరిన్ని కంపెనీలపై ఐటీ దాడులు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఆర్థిక మూలాలను, ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ రైడ్స్, ఈడీ, సీబీఐ కేసులతో టీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కరి చేయాలని భావిస్తున్నట్లు పొలిటికల్స్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ అధికారపరంగా తమకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. రాజకీయంగా దెబ్బతీసి కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలనే ప్లాన్ లో బీజేపీ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు.

అందులో భాగంగానే కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరును తెరపైకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ లో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలతో కేటీఆర్ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు ఐటీ రైడ్స్ ద్వారా కేటీఆర్ ను కూడా ఇరికించే వ్యూహం బీజేపీ చేస్తోందంటున్నారు. వాసవి, ఫీనిక్స్ సంస్థలతో కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయట. కేటీఆర్ ఇన్ డైరెక్టుగా ఆయా సంస్థలకు లబ్ది చేకూర్చినట్లు చెబుతున్నారు.

ఫినిక్స్ కంపెనీ యజమాని చుక్కపల్లి సురేశ్ తో కల్వకుంట కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయట. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో సరేశ్ సిమెంట్ కంపెనీలకు ఫోన్ చేసి టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారట. దీంతో ఈ కంపెనీలపై దాడులు చేయడం ద్వారా లిక్కర్ స్కాంలో కవితను ఇరికించినట్లుగానే.. రియల్ ఎస్టేట్ కంపెనీల అక్రమాల్లో కేటీఆర్ ను ఇరికించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూతురు కవిత, కుమారుడు కేటీఆర్ ను దెబ్బతీయడం ద్వారా కేసీఆర్ ను దెబ్బతీయాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది. ఇప్పటికే సీబీఐ తెలంగాణకు చెందిన ప్రముఖ మద్యం వ్యాపారిపై ఎప్ఐఆర్ నమోదు చేయగా.. ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు తేలడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. త్వరలో కవిత ఇంట్లో కూడా ఈడీ దాడులు చేపట్టే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఇలా కవిత, కేటీఆర్ లపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై ఆందోళణ నెలకొంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోననే బయం వెంటాడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -