BJP-TDP Alliance: ఎన్డీఏలో టీడీపీ చేరే తేదీ ఫిక్స్ అయిందా.. చంద్రబాబు, పవన్ ఆరోజు ఢిల్లీ వెళ్లనున్నారా?

BJP-TDP Alliance: తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు అడుగు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీలతో ఇప్పటికే పొత్తులు కూడా కుదుర్చుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో రాబోతున్నారు.

అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఏఏ ప్రాంతాలలో సీట్లు ఇవ్వాలి అనే విషయాల పట్ల కూడా చర్చలు జరిగాయి ఇకపోతే బిజెపితో పొత్తు పెట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏతో కలిసిపోయి మరోసారి తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న గానీ, 20న గానీ దేశ రాజధాని ఢిల్లీ వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు శని, ఆదివారాల్లో ఇక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశం పూర్తి అయిన అనంతరం పొత్తులపై సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాలని బిజెపి అగ్ర నేతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని, ఏయే స్థానాల్లో బరిలోకి దిగాలో కూడా ఒక అభిప్రాయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరి ఈ రెండు రోజులలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలను కలిసి పొత్తు విషయంపై సుదీర్ఘ చర్చలు జరుపబోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -