Godavari Districts: గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభంజనం ఖాయమా.. ఆ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుందా?

Godavari Districts: గోదావరి జిల్లాలో వైసీపీకి ఎదురుగా గాలి వీస్తోంది. నిజానికి టీడీపీ, జనసేన పొత్తు కుదిరినపుడే మెజారిటీ స్థానాలు కూటమి ఖాతాలో పడిపోతాయని అనుకున్నారు. కానీ.. వైసీపీ మాత్రం కనీసం రిజర్వుడు స్థానాల్లోనైనా గట్టెక్కుతామని భావించింది. అయితే, ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ పరిస్థితి ఓ రకంగా ఉండేది. ఒకటో, రెండు స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని అనిపించేది. కానీ..చంద్రబాబు, పవన్ కలిసి ప్రచారం చేస్తున్నారు. దీంతో.. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఉమ్మడి ప్రచారానికి కనీవినీ ఎరుగని రీతిలో జనం వస్తున్నారు. నగర కూడళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ జనాన్ని చూసి చంద్రబాబు మురిసిపోతున్నారు. తన వయసును మర్చిపోయి మరింత ఉత్సాహంగా ప్రసంగిస్తున్నారు. చంద్రబాబు ప్రసంగం మరింత మందిలో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఉభయగోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. అయితే, అందులో చాలా స్థానాలు స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కింది. దానికి కారణం టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయి. గతసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలు ఆ రెండు పార్టీలకే దక్కి ఉండేవి. ఈసారి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దానికి తోడు ప్రభుత్వ ఓటు బ్యాంక్ చీలనిచ్చేద్దే లేదని కూటమి కట్టారు. దీంతో.. వైసీపీ మెజార్టీ స్థానాల్లో కాదు.. ఏకంగా అన్ని స్థానాల్లో కూడా ఓడిపోతుందని అంటున్నారు. వైసీపీ గోదావరి జిల్లాలో వైసీపీ డిపాజిట్ల కోసమే కృషి చేయాలని కూటమి సెటైర్లు పడుతున్నాయి.

గత ఐదేళ్లు పవన్ కల్యాణ్‌పై వైసీపీ వ్యక్తిగత దాడి చేసింది. దాని ప్రభావం గోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది. ఆయన అనుకూల వర్గం సమయం కోసం ఎదురు చూస్తోంది. ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్దమవుతున్నారు. ఇంకా పవన్ పై మరి కొంతమంది నేతలను ఉసిగొల్పి ఆయనపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు. ఇది కూడా పవన్ ఫ్యాన్స్, జనసేన అభిమానుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది.

వైసీపీ అధిష్టానంలో కూడా ఈ భయం కనిపిస్తోంది. అందుకే.. టీడీపీ, జనసేన నేతలకు కనీవినీ ఎరుగని ఆఫర్లు ఇస్తున్నారు. ఎంత కావాలి? ఏం కావాలని అడుగుతున్నారు. కొంతమంది ఆఫర్లను కాదనలేక వెళ్తున్నా.. లోపాయి కారి కూటమికే పని చేస్తున్నారని చర్చ నడుస్తోంది. దీంతో.. వైసీపీ రెండు విధాలుగా నష్టపోయేలా ఉంది. జనరల్ కేటగిరి స్థానాల్లో వైసీపీ ఎలాగూ వీక్ గా ఉంది. కానీ, ఆ సారి రిజర్వుడు నియోజవకర్గాల్లోనూ బలం కోల్పోయిందని తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లలో దళితలపై ఎక్కువగా దాడులు జరిగాయని ఆయా వర్గాలు నమ్ముతున్నాయి. అందుకే.. ఆె నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి షాక్ తప్పదని తెలుస్తోంది. రంపచోడవరంలో అనంతబాబు తిరిగితే తిరుగుబాటు చేస్తున్నారు. సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీకి డిపాజిట్లు కోల్పోతుందని ఓ అంచనా.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -