TDP JSP Manifesto: టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన అప్పుడే.. ఏకంగా అన్ని లక్షల మంది వస్తారా?

TDP JSP Manifesto: ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పార్టీలు చివరి వరకు పొత్తును కొనసాగించడం చాలా కష్టం. అన్ని పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం కత్తి మీద సాము లాంటింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. కూటమిని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి మళ్లీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. ఇక.. టీఎంసీకి, కాంగ్రెస్‌కు మధ్య సీట్ల సర్థుబాటు ఓ కొలిక్కి రావడం లేదు. ఆప్, కాంగ్రెస్ మధ్య కొన్ని రాష్ట్రాల్లోనే పొత్తు కుదిరింది కానీ.. కీలకమైన పంజాబ్‌లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలకు బీజేపీకి ఓడించాలనే లక్ష్యం తప్పా… సీట్లు త్యాగాలు చేయాలనే ఆలోచన లేదు. అందుకే ఇండియా కూటమి విజయవంతంగా ముందుకు సాగడం లేదు. కానీ.. ఏపీలో మాత్రం టీడీపీ, జనసేన పార్టీలు అందుకు భిన్నమైన వైఖరి తీసుకొని ముందుకు పోతున్నాయి. జగన్ ను ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ముందుకు పోతున్నారు. అది జరగాలంటే.. త్యాగాలకు వెనకాడ కూడదని ఇద్దరు నేతలు మొదటి నుంచి పిలుపుచ్చారు. అందుకే.. గెలిచే స్థానాలను వదులు కోవడానికి 2 పార్టీలు సిద్దమయ్యాయి. దీంతో.. పొత్తు విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఒకటో అరో నాయకుల్లో కాస్తా అసంతృప్తి ఉన్నా.. చంద్రబాబు, పవన్ బుజ్జగిస్తూ పోతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఉండేదుకు చాలా ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది. ఇప్పటి కూడా చేస్తూనే ఉంది. రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. కానీ.. చంద్రబాబు, పవన్, లోకేష్ అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. వైసీపీ ట్రాప్ లో పడొద్దని.. ఆ పార్టీ నేతల మాటలకు టెమ్ట్ అవ్వొద్దని సూచిస్తున్నారు. అంత జాగ్రత్తగా వ్యవహిరిస్తున్నారు కనుక.. ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలకు ఇరు పార్టీలు సిద్దమయ్యాయి.

ఈనెల 17న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నాయి. చిలకలూరి పేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన అక్కడ మ్యానిఫెస్టో విడుదల చేస్తారు. అచ్చెన్నాయుడు, నాదేండ్ల మనోహర్ ఈ ప్రకటన చేశారు. 10 లక్షల మందితో చిలకలూరిపేట సభను నిర్వహిస్తామని అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికను కూడా అదే సభలో ప్రకటిస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు అన్నారు. టీడీపీ, జనసేన పొత్తును చెడగొట్టాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది కానీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని ఆయన చెప్పారు.

అటు.. వైసీపీపై నాదెండ్ల మనోహర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బందితో పాటు.. జనసేన టీంలను కూడా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని ఎంత భయపెట్టాలని చూస్తే అంతే బలపడతామని మనోహర్ అన్నారు. మ్యానిఫెస్టో సభను విజయవంతం చేసి తర్వాత ఆ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -