TDP: మునుగోడులో టీడీపీ పోటీ.. అభ్యర్థి ఆయనే?

TDP: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్నీ మునుగోడు ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. పార్టీలన్నీ అక్కడే మకాం వేసి మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు స్కెచ్ లు వేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నికల కోసం మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని సూచిస్తున్నాయి.

అయితే తెలంగాణలో దాదాపు భూస్థాపితం అయిన టీడీపీ కూడా మునుగోడు ఉపఎన్నికల బరిలోకి దిగనుంది. మునుగోడు ఉపఎన్నిక బరిలోకి దిగడం ద్వారా తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకోవాలని చూస్తోంది. టీడీపీ కూడా బలంగా ఉందనే అంశాన్ని తెలపడం కోసం మునుగోడులో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు మునుగోడులో పోటీ చేయాలని టీటీడీపీ నేతలకు సూచించారు. మునుగోడులో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గ ఓటర్ల ఎక్కువగా ఉన్నారు. దీంతో బలమైన బీసీ నేతను పోటీలోకి దింపేందుకు టీటీడీపీ కసరత్తు చేస్తోంది.

తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ ను పోటీలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో జక్కలి ఐలయ్య యాదవ్ ను టీడీపీ పోటీలోకి దింపాలని భావిస్తోంది. చంద్రబాబు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయాలని ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఖమ్మం జిల్లా ఏపీకి దగ్గర ఉండటంతో ఏపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ గానే ఉందని చెప్పుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ లేదనే చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ 10కిపైగా ఎమ్మెల్యే సీట్లు గెలవగా.. వాళ్లను కేసీఆర్ టీడీపీలోకి లాక్కున్నారు. టీడీపీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయినట్లు అయింది. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం, బలమైన రేవంత్ రెడ్డి లాంటి నేత కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -