TDP: రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెడుతున్న చంద్రబాబు నాయుడు.. వైసీపీకి చుక్కలు కనిపించనున్నాయా?

TDP:  ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రజలలోకి వస్తూ తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున రోడ్డు షోలో పాదయాత్రలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత నెల తొమ్మిదవ తేదీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసింది.

ఇక పలు సర్వేల ప్రకారం గతంతో పోలిస్తే టిడిపి ఉత్తరాంధ్ర సీమ జిల్లాలలో కాస్త మెరుగుపడిందని తెలుస్తోంది. ఇక రాయలసీమలో మాత్రం తెలుగుదేశం పార్టీ కాస్త వెనుకబడి ఉండడంతో ఈసారి రాయలసీమలో కూడా తమ పార్టీ జెండా ఎగరవేయాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. టిడిపికి కంచుకోటగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో 2014వ సంవత్సరంలో 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచింది. గత ఎన్నికలలో ఇది కాస్త రివర్స్ అయింది.

ఈ క్రమంలోనే సీమ జిల్లాలపై టిడిపి ప్రత్యేక దృష్టి పెడుతూ అక్కడ సమస్యలను పరిష్కరిస్తే తప్పకుండా వచ్చే ఎన్నికలలో మన పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆలోచనలలో టిడిపి నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సీమ చాలా సమస్యలపై పోరాడుతున్న వారందరితో ఎక్కడకక్కడ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

పార్టీ పరంగా కాకుండా సీమ జిల్లాలపై అక్కడి సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి వారితో తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ వారికి టికెట్ ఇచ్చేలా ఆలోచనలు చేయడమే కాకుండా వారిని ప్రోత్సహిస్తూ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని రాజకీయ వ్యూహం వేస్తోంది. మరి ఈ వ్యూహాలు ఫలిస్తాయా వచ్చే ఎన్నికలలో రాయలసీమలో కూడా తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి వస్తారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -