Kodali Nani: కొడాలి నాని ఓటమిని ఒప్పుకున్నాడా.. చరిత్రలో కనీవిని ఎరుగని ఓటమిని చూడబోతున్నాడా?

Kodali Nani: రాజకీయాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక మాట ఎక్కువ కాకుండా.. ఒక మాట తక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. ఒక మాట తక్కువ అయినా పర్వాలేదు. కానీ, ఎక్కువ అయితే మాత్రం చాలా ప్రమాదం. వైసీపీ ఫూర్ బ్రాండ్ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నారు. నిజానికి కొడాలి నాని ఏం మాట్లాడినా త్వరగా వైరల్ అవుతుంది. ఆయనకు అభిమానించే వాళ్లు ఎంత ఎక్కువ మంది ఉంటారో.. ఆయన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా అంతే ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఆయనకి సంబంధించిన న్యూస్ త్వరగా వైరల్ అవుతోంది.

కొడాలి నాని ఇవే తనకు చివరి ఎన్నికలు అని అన్నారు. ఇప్పుడు తన వయసు 53 ఏళ్లని.. మరోసారి గెలిస్తే 58 ఏళ్ల వరకూ పదవిలో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకా రాజకీయం చేయలేమని తేల్చేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారికి రాజకీయాలపై ఆసక్తిలేదని చెప్పారు. ఆసక్తి ఉంటే తన తమ్ముడు కొడుకు రాజకీయాలు చేస్తాడని అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ పై ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు.

చంద్రబాబు కూడా ఓ ఏడాది క్రితం ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అన్నారు. దానిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు. చంద్రబాబుకి సీన్ అర్థం అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఈ ఎన్నికల తర్వాత మూట ముళ్లు సర్థుకొని బాబు హైద్రాబాద్ వెళ్లిపోతారని విమర్శలు చేశారు. కానీ, చంద్రబాబు వయసు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. చంద్రబాబుకి ఇప్పుడు 73 ఏళ్లు. 2029 నాటికి 78 ఏళ్లు అవుతాయి. అప్పటికీ ఆయన పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండటం కష్టం. కాబట్టి చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు అన్నారు అంటే అర్థం ఉంది. కానీ, చంద్రబాబుపై అప్పుడు వైసీపీ సెటైర్లు వేసింది. మరి అలాంటప్పుడు కొడాలి నాని తెలిసి తెలిసి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో అర్థం కావడం లేదు.

కొడాలి నాని కామెంట్స్ వెనక చాలా పెద్ద కథే ఉందని ఓ చర్చ నడుస్తోంది. జగన్‌తో కలిసి రాజకీయం చేయలేమని కొడాలి నాని తెలుసుకున్నారని టాక్ నడుస్తోంది. కొడాలి నానితో జగన్ లాభ పడ్డారు. కానీ.. వైసీపీలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చాలా నష్టపోయారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టాలంటే సీఎం జగన్.. కొడాలి నానిని రంగంలోకి దించేవారు. కొడాలి నానికి నోటు దురుసు ఎక్కువ కనుక నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. దీని వలన సొంత సామాజిక వర్గానికే కొడాలి నాని విలన్ అయ్యారు. అంతేకాదు.. తన మాటలతో ప్రజల్లో కూడా పలచని భావనను ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా జగన్ వలనే. అలా అని ఏదైనా ప్రయోజం ఉందా? అంటే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి నుంచి కూడా జగన్ తొలగించారు. మరికొంత కాలం జగన్ తోనే ట్రావెల్ చేస్తే ఉన్న విలువ కూడా పోతుందని కొడాలి నాని భావిస్తున్నట్టు గుడివాడ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అలా అని వేరే పార్టీలోకి కొడాలి నాని వెళ్లలేరు. వెళ్లినా ఎవరూ తీసుకోరు. అందుకే, తానే గౌవరం రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఎన్నికల ప్రచారంలో ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఓ అస్త్రాన్ని ప్రయోగిస్తుతున్నారు. ఒకవేళ గెలిస్తే గుడివాడలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు.

అయితే నాని వ్యాఖ్యలపై టీడీపీ సెటైర్లు వేస్తోంది. ఓటమి భయంతోనే కొడాలి నాని ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. అంతేకాదు.. ఈసారి గెలిపిస్తే నియోజవర్గాన్ని అభివృద్ది చేస్తానని నాని చెప్పడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. నాలుగు సార్లు ఒకే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా.. మరోసారి గెలిపించండి అభివృద్ధి చేస్తాననడం దారుణమని మండిపడుతున్నారు. అంటే తన నియోజవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నారని.. అలాంటి వ్యక్తి మరోసారి ఎందుకు గెలిపించాలని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని చేసిన కామెంట్స్ ఆయన కొంప ముంచేలా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -