Viveka Website: వివేకా మర్దర్ గురించి టీడీపీ వెబ్ సైట్.. ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viveka Website: వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో పావులు కనిపిస్తుంది. దొరికిన ప్రతి ఆస్త్రాన్ని వైఎస్ఆర్ సీపీ మీద వదలటానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఆ క్రమంలోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా తన అస్త్రంగా వైసీపీ మీదకి వదిలింది టీడీపీ. చనిపోయినది సొంత చిన్నాన్న అయినప్పటికీ ఎందుకు ఎందుకు జగన్ ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఎందుకు ఈ కేసుని ముందుకు కదలనివ్వడం లేదు అంటూ ఇప్పటికే ఆ హత్య కేసుని తెగ హైలెట్ చేసింది టీడీపీ. అయితే ఇప్పుడు తాజాగా మరొక అడుగు ముందుకు వేసి వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒక వెబ్ సైట్ లో పొందుపరిచి ఇటీవలే లాంచ్ చేసింది టీడీపీ. ఈ వెబ్సైట్ ను కేవలం ఈ కార్యక్రమానికి మాత్రమే కేటాయించడం గమనార్హం. వివేకానంద రెడ్డి మరణం తో పాటు ఆయనకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ఏం చెప్పారు.

 

ఇప్పుడు ఏం చెప్తున్నారు వంటి వీడియోలు కూడా పొందుపరిచింది. అలాగే కోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు నుంచి పులివెందుల కోర్టు వరకు ఇచ్చిన ఆదేశాలు సీబీఐ అధికారులు విచారణ ఇలాంటి అప్డేట్స్ అన్ని అందులో పొందుపరిచింది. వీటితో పాటు వివేకానంద రెడ్డి హత్యపై వివిధ మీడియా సంస్థలు వెలువరించిన విశ్లేషణాత్మక కథనాలు పరిశోధనాత్మక కథనాలని కూడా టీడీపీ ఈ వెబ్సైట్లో పేర్కొంది.

 

ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం ద్వారా వైఎస్ హత్య కేసులో ఉన్న లోపాలని ఎత్తిచూపటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది టీడీపీ. తద్వారా వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం భవిష్యత్తు ప్లాన్ గా తీర్చిదిద్దింది. అయితే ఈ అస్త్రం ఎన్నికలలో ఉపయోగపడుతుందో లేదో అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల ఫలితాలు వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -