Rishabh: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

 

Rishabh: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుండి తన ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న రిషబ్ పంత్ కారు.. హమ్మడ్ పూర్ ఝాల్ (ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో) వద్ద ప్రమాదానికి గురైంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కారు డివైడర్ ని ఢీకొన్నట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ తన బీఎండబ్లూ కారులో ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది.

వైద్యం కోసం రిషబ్ పంత్ ను స్థానికులు వెంటనే సాక్ష్యం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన రిషబ్ పంత్ ను అక్కడి వైద్య సిబ్బంది ఢిల్లీకి తరలించాలని రెఫర్ చేశారు. కాగా రిషబ్ పంత్ కాళ్లకు మరియు తలకు బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. నడుము ప్రాంతంలో కూడా రిషబ్ పంత్ కు గాయమైనట్లు సమాచారం ఉండగా.. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఇక రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయిన సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అవసరమైన సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘ఒకవేళ అవసరమైతే ఎయిర్ లిఫ్ చేస్తాం, అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తాం, చికిత్స అవసరమైన పూర్తి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది’ అని ఫుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

కాగా స్థానికుల సమాచారం ప్రకారం రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్ ని ఢీ కొట్టిందట. దాంతో ఒక్కసారిగా కారులో మంటలు రేగగా.. స్థానికులు కష్టం మీద కారులో ఉన్నటువంటి రిషబ్ పంత్ ను బయటకు లాగినట్లు తెలుస్తోంది. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న రిషబ్ పంత్ ను వెంటనే ఢిల్లీ రోడ్ లోని సాక్ష్యం ఆస్పత్రికి తరలించడం జరిగింది. రిషబ్ పంత్ కు అవసరమైన అత్యవసర చికిత్సను అందించి, ఢిల్లీకి తరలించాలని రెఫర్ చేసినట్లు సాక్ష్యం హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్. సుశీల్ నగర్ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -