Telangana: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం..ఇంకెంతమంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసింది?

Telangana:  తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయింది. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తుండగా హైదరాబాద్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి పట్టుకున్నారు. భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ డీల్ కుదుర్చున్నట్లు పోలీసులు సమాచారం అందింది. ఓ హోటల్ లో కలుుకుని డబ్బులు అందజేస్తున్నట్లు తెలుసుకన్నారు. దీంతో డబ్బులు అందిస్తున్న సమయంలో అడ్డంగా పట్టుకున్నారు.

మెయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి స్వామిజీతో పాటు సింహయాజులు అనే స్వామిజీ, హైదరాబాద్ కు చందిన నందకుమార్ లను పోలీసులు పట్టుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ బేరసారాల్లో కోల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో పట్టుబడ్డ నంద కుమార్ అనే వ్యక్తి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిక అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారనే ప్రచారం జోరుుగా జరుగుతోంది.

ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అనే వ్యక్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముందుగా సంప్రదింపులు జరిపారని టాక్ నడుస్తోంది. ఇందులో పట్టుబడ్డ రామంద్రభారతి అనే స్వామిజీ ఫరీదాబాద్ టెంపులో ఉంటారని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇక తిరుపతి నుంచి ఒక వ్యక్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక్కో ఎమ్మెల్యేకు కనీసం వంద కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డబ్బులతో పాటు పలు కాంట్రాక్ట్ పనులు, కీకల పదవులు ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చిట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణ రాజకీయాలల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలన్నీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య వలసలు కొనసాగుతోన్నాయి. బీజేపీ నేతలను టీఆర్ఎస్ చేర్చుకుంటున్న తరుణంలో బీజేపీ కూడా టీఆర్ెస్ నేతలకు గాలం వేస్తోంది. పలువరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, నలుగురు మంత్రులు కూడా తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ ఇటీవల మునుగోడు ప్రచారంలో బీజేపీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే వాళ్లు పార్టీలో చేరతారంటూ బీజేపీ నేతలు ప్రకటనల మీ ద ప్రకటనలు చేస్తున్నారు.మునుగోడు ఉఫఎన్నికలు హోరాహోరాగా జరుగుతున్న క్రమంలో బీజేపీ అడ్డంగా దొరకిపోవడం ప్రకంపనలు రేపుతోంది.

చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ఇటీవల కాషాయ నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ దొరకడం సంచలనం రేపుతోంది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై టీఆర్ెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులుకొన్నట్లు టీఆర్ఎస్ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. రానున్న కొద్దిరోజుల పాటు ఈ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేసే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -